
నందమూరి నటసింహం బాలకృష్ణ పైరసీ రక్కసిపై గర్జించారు. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో పైరసీ ఎక్కువవుతుందన్నారు. దీంతో సినీ నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినీప్రియులంతా పైరసీ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రతీఒక్కరు పైరసీ భూతానికి వ్యతిరేకంగా పోరాడాలని బాలకృష్ణ అభిమానులకు పిలుపునిచ్చారు.
Also Read: రష్మిక ఎవరినీ వదిలిపెట్టడం లేదుగా..!
తాజాగా బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో పైరసీతో సినీ నిర్మాతలు పడుతున్న ఇబ్బందులు గురించి ప్రస్తావించారు. పైరసీ కారణంగా నిర్మాతలు కోట్లల్లో నష్టపోతున్నారని తెలిపారు. పైరసీని తరిమివేసేందుకు ప్రతీఒక్క అభిమాని సైనికుడిలా పోరాడాలంటూ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బాలకృష్ణ ట్వీటర్లో పోస్టు చేశారు.
అదేవిధంగా ‘నర్తనశాల’ మూవీ విశేషాలపై అందరికీ తెలియజేశారు. తన తండ్రి నందమూరి తారకరామరావు నటించిన ‘నర్తనశాల’ మూవీని తాను రీమేక్ చేయాలని గతంలోనే అనుకున్నట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే సినిమాను ప్రారంభించానని.. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఆ సినిమా నిలిచిపోయిందని తెలిపారు. అయితే ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను శనివారం శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్లో విడుదల చేసినట్లు తెలిపారు.
విజయదశమి కానుకగా ‘నర్తనశాల’లోని 17నిమిషాల నిడివిగల సన్నివేశాలను అభిమానుల ముందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతీఒక్కరు ఈ సినిమాను చూసి ఆదరించాలని ఆయన కోరారు. ఈ మూవీలో బాలకృష్ణ అర్జునుడిగా నటిస్తుండగా.. దివంగత నటి సౌందర్య ద్రౌపదిగా.. శ్రీహరి భీముడిగా నటించారు. ఈ చిత్రం ద్వారా సౌందర్య మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బాలయ్యా నువ్వు గ్రేటయ్యా.. కోటి కొట్టేశావ్.. !
అభిమానులంతా శ్రేయాస్ ఈటీ ద్వారానే ‘నర్తనశాల’ మూవీని చూడాలని.. పైరసీ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ కోరారు. కరోనా కారణంగా బాలయ్య-బోయపాటి సినిమా వాయిదా పడిన సంగతి తెల్సిందే. అయినప్పటికీ బాలకృష్ణ తాను గతంలో హీరోగా నటించిన తెరకెక్కించిన ‘నర్తనశాల’తో అభిమానుల ముందుకు వచ్చారు. బాలయ్య సినిమా పండుగకు రావడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
🌟The wait is over🌟
Natasimham #NandamuriBalakrishna's long awaited mythological epic #Narthanasala trailer is out now
Watch it here : https://t.co/KbrRwIeNIO
Releasing this 24th on @ShreyasET, Book your tickets : https://t.co/8mq20OauMj#NarthanasalaOnShreyasET pic.twitter.com/Kkk27t7heV
— NBK FILMS (@NBKFilms_) October 22, 2020