ఉల్లి ధరల ఘాటు తగ్గనుందా? కేంద్రం కీలక నిర్ణయాలు

దేశంలో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. కోయకుండానే జనాలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లి పేరు ఎత్తితేనే ఉలిక్కిపడుతున్నారు. వంటల్లో ఉల్లి ఘాటు తగ్గింది. ఉల్లి లేకుండానే బీద బిక్కి వంటలు వండుకుంటున్నారు. ఇంటింటా ఉల్లి ఎఫెక్ట్ ఇంతలా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ధరలు తగ్గించేందుకు కీలక చర్యలు చేపట్టింది. Also Read: కరోనా, వర్షాలు.. చార్జీల మోతలు.. సొంతూళ్లకు వెళ్లని జనం ఉల్లి ధరలను తగ్గించడానికి, దేశీయ లభ్యతను మెరుగుపరచడానికి.. కస్టమర్లకు ఉపశమనం కలిగించేందుకు రిటైల్, […]

Written By: NARESH, Updated On : October 24, 2020 5:40 pm
Follow us on

దేశంలో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. కోయకుండానే జనాలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లి పేరు ఎత్తితేనే ఉలిక్కిపడుతున్నారు. వంటల్లో ఉల్లి ఘాటు తగ్గింది. ఉల్లి లేకుండానే బీద బిక్కి వంటలు వండుకుంటున్నారు. ఇంటింటా ఉల్లి ఎఫెక్ట్ ఇంతలా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ధరలు తగ్గించేందుకు కీలక చర్యలు చేపట్టింది.

Also Read: కరోనా, వర్షాలు.. చార్జీల మోతలు.. సొంతూళ్లకు వెళ్లని జనం

ఉల్లి ధరలను తగ్గించడానికి, దేశీయ లభ్యతను మెరుగుపరచడానికి.. కస్టమర్లకు ఉపశమనం కలిగించేందుకు రిటైల్, టోకు వ్యాపారాలపై డిసెంబర్ 31వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితిని కేంద్రం విధించింది. చిల్లర వ్యాపారులు 2 టన్నుల వరకు మాత్రమే నిల్వ చేసుకోవచ్చు. హోల్ సేల్ వ్యాపారులు 25టన్నుల వరకు నిల్వ ఉంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్ స్పష్టం చేశారు.

గత నెలలో పార్లమెంట్లో ఆమోదించిన ఎసెన్షియల్ కమోడిటీస్ (నిత్యావసరాలు) సవరణ చట్టాన్ని అమలు చేయాలసి ఉందని.. ఇది అసాధారణమైన ధరల పెరుగుదల పరిస్థితిలో పాడైపోయే వస్తువులను నియంత్రించడానికి వీలు కల్పిస్తుందని ఆమె చెప్పారు. ఆ తర్వాత వినియోగదారుల వ్యవహారాల మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ లో..“పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించడానికి, హోర్డింగ్స్ ను అరికట్టడానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడో దశను తీసుకుంది. చిల్లర వ్యాపారులపై 2టన్నుల స్టాక్ పరిమితిని, హోల్ సేల్ వ్యాపారులపై 25టన్నులను విధించింది” అని పేర్కొన్నారు.

కాగా.. ఉల్లి ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో భారీ వర్షాలతో ఖరీఫ్ పంట దెబ్బతిన్న నేపథ్యంలో గత కొద్ది వారాల్లోనే ఉల్లి దరలు కిలోకు రూ.75కు పైగా పెరిగాయి. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంతే గాక కొందరు వ్యాపారులు అతి లాభాపేక్షతో అక్రమ నిల్వలు చేసి ధరలు కృత్తిమంగా పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉల్లి నిల్వలపై కేంద్రం పరిమితులను విధించింది. దీంతో సరఫరా పెరిగి ఉల్లి ధరలు తగ్గనున్నాయి.

Also Read: కేసీఆర్ బడ్జెట్‌ భారం తగ్గించుకుంటున్నారు

ఈ నేపథ్యంలోనే ఉల్లి ధరలను తగ్గించేందుకు విదేశాల నుంచి ఉల్లి దిగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 15వరకు ఈ దిగుమతులు జరుగుతాయి. దీంతో సరఫరా పెరిగి ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉంది. కాగా.. 37లక్షల టన్నుల ఖరీఫ్ పంట కొద్ది రోజుల్లోనే మండీలకు రానుంది. దీంతో పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలుగనుంది.