Andaman Nicobar islands : అండమాన్ నికోబార్ దీవుల గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు

Andaman Nicobar islands : అండమాన్ నికోబార్ దీవుల చరిత్ర.. భారత్ కు ఒక వరం అని చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ అభివృద్ధి చకచకా జరుగుతోంది. గ్రేట్ నికోబార్ పోర్ట్ ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. 2014కు ముందు వరకూ గడిచిన 70 ఏళ్లలో అండమాన్ నికోబార్ అభివృద్ధికి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ దీవులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి డెవలప్ చేస్తోంది. 2015 నుంచి అక్కడ చకచకా అభివృద్ధి జరుగుతోంది. ‘మారిటామ్ హబ్’ […]

Written By: NARESH, Updated On : November 26, 2022 8:11 pm
Follow us on

Andaman Nicobar islands : అండమాన్ నికోబార్ దీవుల చరిత్ర.. భారత్ కు ఒక వరం అని చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ అభివృద్ధి చకచకా జరుగుతోంది. గ్రేట్ నికోబార్ పోర్ట్ ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. 2014కు ముందు వరకూ గడిచిన 70 ఏళ్లలో అండమాన్ నికోబార్ అభివృద్ధికి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ దీవులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి డెవలప్ చేస్తోంది. 2015 నుంచి అక్కడ చకచకా అభివృద్ధి జరుగుతోంది. ‘మారిటామ్ హబ్’ అనే ప్రణాళికతో మోడీ ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి చేస్తోంది.

మారిటామ్ హబ్’తో కనెక్టివిటీని పెంచడం.. ఎనర్జీని బలోపేతం చేయడం.. టూరిజం పెంపొందించడం కోసం మోడీ సర్కార్ అడుగులు వేసింది. ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించారు. చెన్నై నుంచి అండమాన్ కు ఆఫ్టికల్ ఫైబర్ కనెక్టివిటీని కల్పించారు. 2020 ఆగస్టు కల్లా దీన్ని పూర్తి చేశారు.

2300 కి.మీలు చెన్నై నుంచి అండమాన్ ద్వీపాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చారు. 1224 కోట్ల ఖర్చుతో దీన్ని పూర్తి చేశారు. దీంతో పోర్ట్ బ్లెయిర్ కు 400 జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. రెండోది ఐలాండ్ జోన్ చట్టం తీసుకొచ్చారు. కఠిన నిబంధనలు తీసుకొచ్చి పోర్టులు, హబ్ లు కట్టుకోవడానికి భూసేకరణకు మినహాయింపులు ఇచ్చింది.

అండమాన్ నికోబార్ దీవుల గురించి ఎవ్వరికీ తెలియని విషయాల గురించి ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.