Nitin Gadkari
Nitin Gadkari: దేశంలో మూడోసారి అధికారంలో వచ్చిన భారతీయ జనతాపార్టీ రికార్డు సృష్టించామనుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వాస్తవానికి 2014లో కాంగ్రెస్ ఓడిపోవడానికి, బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అవినీతి, కుంభకోణాలు. అప్పటి వరకు బీజేపీ అంటే మతపరమైన పార్టీ అనే ముద్ర ఉండేది. కానీ, 2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న నాటి యూపీఏ(ప్రస్తుత ఇండియా కూటమి) ప్రభుత్వంపై వ్యతిరేకత.. బీజేపీని అధికారంలోకి రావడానికి కారణమైంది. 2014 నుంచి 2019 వరకు బీజేపీ అవినీతి రహిత పాలన అందించడంతో మరోమారీ ప్రజలు బీజేపీవైపే మొగ్గు చూపారు. ఎన్నికల వేళ జరిగిన పుల్వామా దాడి కూడా బీజేపీకి కలిసి వచ్చింది.
రూపం మారిన అవినీతి..
కాంగ్రెస్ అంటే అవినీతి, కుంభకోణాలు అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. పాలనలో కూడా అంతకు మించే అవినీతి జరుగుతోంది. అయితే దీనిని ప్రచారం చేయడంలో విపక్ష కాంగ్రెస్ విఫలమవుతోంది. అవినీతిలో కాంగ్రెస్‌కు, బీజేపీకి ఉన్న తేడా ఏమిటంటే.. కాంగ్రెస్ హయాంలో అవినీతిలో అందరి భాగస్వామ్యం ఉండేది. బీజేపీ పాలనలో వైట్‌కాలర్ అవినీతి పెరిగింది. కేంద్రస్థాయిలోనే అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంబానీ, అధానీలనే బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహించడం ద్వారా కేంద్రం అవినీతికి పాల్పడుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Also Read: 9కి 9 సీట్లు.. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కూటమి సంచలనం!
అధిష్టానం చేతిలో అధికారం..
ఇక కాంగ్రెస్ అంటే.. గాంధీ కుటుంబం మాత్రమే అని బీజేపీ నేతలు పదే పదే ఆరోపిస్తారు. కాంగ్రెస్ ఓటమికి ఇదీ ఓ కారణమే. కానీ, ఇప్పుడు బీజేపీలో కూడా అదే జరుగుతోంది. అధికారం అంటే గడిచిన పదేళ్లుగా మోదీ, అమిత్‌షా అన్నట్లుగానే సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉన్నా.. పాలనాపరమైన నిర్ణయాలుగానీ, పార్టీ పరమైన నిర్ణయాలుగానీ మోదీ–షా ద్వయమే తీసుకుంటోంది. అంటే కాంగ్రెస్ తరహాలోనే అధికారం బీజేపీలో కూడా ఇద్దరి చేతుల్లోనే ఉంది.
వాళ్లది కుల రాజకీయం.. వీళ్లది మత రాజకీయం..
ఇక కాంగ్రెస్ అంటే హిందూ వ్యతిరేక పార్టీ అని, కుల రాజకీయాలు చేస్తుందని అన్న ఆరోపణలు బీజేపీ చేస్తుంది. ముస్లింలకు మాత్రమే కాంగ్రెస్ అండగా నిలుస్తుందని, మెజారిటీ హిందువులను మైనారిటీలుగా మార్చాలని చూస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు బీజేపీ కూడా కుల రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. గతంలో కేవలం హిందుత్వ ఎజెండా పైనే రాజకీయాలు చేసిన భారతీయ జనతాపార్టీ ఇప్పుడు కూలాల ప్రాతిపదికన కూడా రాజకీయాలు చేస్తోంది. ఇందుకు తెలంగాణలో మాదిగలు, బీసీల సభ నిర్వహించడమే ఉదాహరణ. బీసీ నేత ప్రధాని అయ్యాడు, బీసీ నేతను బీజేపీ ముఖ్యమంత్రిని చేసిందని చెప్పుకోవడం ద్వారా కుల రాజకీయాలు చేపట్టింది. ఇక ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పడం ద్వారా మోదీ నేరుగా కుల రాజకీయాలకు తెరతీశారు.
ప్రభుత్వాలు కూల్చడం..
ఇక కాంగ్రెస్‌లో గతంలో ముఖ్యమంత్రులను మార్చే సంప్రదాయం ఉండేది. రాజకీయంగా ఎవరు బలవంతులైతే వారికే పదవులు దక్కేవి. ప్రస్తుత బీజేపీ కూడా గడిచిన ఐదేళ్లలో ఇదే చేస్తోంది. అధికారం కోసం బీజేపీ అర్రులు చాస్తోంది. రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ప్రభుత్వాలను బీజేపీ కూలుస్తోంది. గడిచిన పదేళ్లలో దేశంలోని పది రాష్ట్రాల్లో బీజేపీ ఇలాగే అధికారంలోకి రావడం ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ ముఖ్యమంత్రులను మారిస్తే.. బీజేపీ ప్రభుత్వాలనే మార్చేస్తోంది.
-వారసత్వ రాజకీయలు…
కాంగ్రెస్‌పై బీజేపీ పట్టు చేయి సాధించడానికి మరో ప్రధాన కారణం వారసత్వ రాజకీయాలు. బీజేపీ దీనిని బలంగా జనంలోకి తీసుకెళ్లింది. నెహ్రూ కాలం నుంచి అధికారం, పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉంటున్నాయని, వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ కేరాఫ్‌గా మారిందని బీజేపీ ఆరోపిస్తోంది. కానీ, ఇప్పుడు బీజేపీలోనూ అదే కనిపిస్తోంది. బీజేపీ వారసత్వ రాజకీయాలు ప్రోత్సహించదు అన్న అభిప్రాయం ప్రజల్లో ఉండేది. అయితే అధికారం కోసం వలసలను ప్రోత్సహిస్తున్న బీజేపీ.. తద్వారా వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. చంద్రబాబు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తారని ఆరోపించిన బీజేపీ.. ఇప్పుడు అధికారం కోసం అదే పార్టీని ఎన్డీఏలో చేర్చుకుంది. వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతల వారసులకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చింది. తద్వారా ఇంతకాలం వారసత్వ రాజకీయాలకు బీజేపీ దూరం అన్న క్రెడిట్‌ను కూడా బీజేపీ కోల్పోతోంది.
-గడ్కరీ హెచ్చరిక అదే..
ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గోవాలో నిర్వహించిన బీజేపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో పరోక్షంగా బీజేపీ నేతలకు హెచ్చరికలు చేశారు. కాంగ్రెస్ చేసిన తప్పులను మనం చేస్తే కాంగ్రెస్‌కు మనకూ తేడా ఉండదని పేర్కొన్నారు. కాంగ్రెస్ తప్పు చేసిందనే ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెట్టారని, కాంగ్రెస్ తప్పులను మనం చేయకూడాదని పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఉద్దేశించి చేసినవే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఉప ఫలితాలు’: దేశంలో ఇండియా కూటమి హవా.. ఒక్కస్థానానికే ఎన్డీఏ పరిమితం.. బీజేపీ మేలుకోవాల్సిన టైం
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: Union minister nitin gadkari warned that bjp did not commit the same mistake as congress