Modi Birthday: భారతీయ జనతా పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని వరకు ఎదిగిన నేత నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. సెప్టెంబర్ 17న ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ నేతలు మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏటా మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అనేక మంది గిఫ్ట్‌లు పంపుతున్నారు. చారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన గిఫ్టులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 600లకుపైగా కానుకలు వేలం వేసేందుకు సిద్ధమైంది. మోదీ పుట్టిన రోజైన సెప్టెంబర్ 17న ఈ వేలం ప్రారంభించనున్నట్లు కేంద్రం తెలిపింది. 600 గిఫ్టుల విలువ రూ.1.60 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
74వ పుట్టిన రోజు..
ప్రధాని నరేంద్రమోదీ 74వ పుట్టిన రోజు వేడుకలు మంగళవారం నిర్వహించనున్నారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యకక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. మరోవైపు కే ంద్రం కూడా మోదీ పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మోదీకి వచ్చిన కానుకలను వేలం వేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. ఆన్‌లైన్‌లో ఈ వేలం నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు ఈ వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఎవరైనా కొనుగోలు చేయవచ్చు
ఇదిలా ఉంటే.. కేంద్రం వేలం వేసే 600 గిఫ్టుల్లో మీకు నచ్చిన గిఫ్టును మీరు కూడా కొనుగోలు చేయవచ్చు. కానుకల్లో స్పోర్ట్స్ షూ మొదలుకొని.. వెండి వీణ, రామ మందిరం ప్రతిమ వంటి అనేక గిఫ్టులు ఉన్నాయి. ఇందులో కనిష్ట విలువ రూ.600 గరిష్ట విలువ రూ.8.26 లక్షలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మొత్తం బహుమతులు విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా వేసింది.
నమామి గంగేకు విరాళం..
మోదీ గిఫ్టుల వేలం ద్వారా వచ్చే సొమ్మును నమామి గంగే నిధికి విరాళంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. మోదీ బహుమతుల వేలం 2019 నుంచి ప్రారంభించారు. తమకు నచ్చిన బహుమతి కోసం దేశ ప్రజలంతా ఈ వేలంలో పాల్గొనే అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లో అక్టోబర్ 2 వరకు వేలం అందుబాటులో ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ https://pmmementos.gov.in ద్వారా పేర్లు నమోదు చేసుకుని వేలంలో పాల్గొనవచ్చని కేంద్రం తెలిపింది. వెబ్‌సైట్‌లో వేలంలో ఉంచిన గిఫ్టుల వివరాలు ఉన్నట్లు పేర్కొంది.