https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కే యాటిట్యూడ్ చూపించిన ఏకైక హీరోయిన్… చివరికి ఆమె కెరీర్ ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ తో మూవీ చేసే అవకాశం కోసం హీరోయిన్స్ ఎగిరి గంతేస్తారు. ఆయనతో జత కడితే స్టార్ హీరోయిన్ హోదా దక్కుతుందని భావిస్తారు. అయితే ఓ హీరోయిన్ పవన్ కళ్యాణ్ కి కూడా యాటిట్యూడ్ చూపించిందంట. ఆ హీరోయిన్ ఎవరు? ఆమె కెరీర్ ఎలా ముగిసింది?

Written By:
  • S Reddy
  • , Updated On : September 17, 2024 / 10:35 AM IST

    Pawan Kalyan(13)

    Follow us on

    Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫేమ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అత్యంత భారీ ఫ్యాన్ బేస్ కలిగి హీరో పవన్ కళ్యాణ్. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు వసూళ్ళు రాబడతారు. ఆయన సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే చాలని అభిమానులు కోరుకుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ మూవీలో ఛాన్స్ కోసం హీరోయిన్స్ ఎదురు చూస్తారు. ఆయనతో నటిస్తే స్టార్ హీరోయిన్ హోదా పట్టేయ వచ్చని సంబరపడతారు. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ కే యాటిట్యూడ్ చూపిందట ఓ హీరోయిన్.

    ఆమె ఎవరో కాదు మీరా జాస్మిన్. కేరళకు చెందిన మీరా జాస్మిన్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా వెలుగొందింది. 2001లో మలయాళ చిత్రం సూత్రధారన్ తో ఆమె వెండితెరకు పరిచయమైంది. తమిళ చిత్రం రన్ ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టింది. మాధవన్ హీరోగా నటించిన రన్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మీరా జాస్మిన్ కట్టి పడేసింది.

    పందెం కోడి సైతం మీరా జాస్మిన్ హిట్ చిత్రాల జాబితాలో ఉంది. తెలుగులో మీరా జాస్మిన్ మొదటి చిత్రం అమ్మాయి బాగుంది. శివాజీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్ డ్యూయల్ రోల్ చేసింది. అమ్మాయి బాగుంది మూవీ హిట్ టాక్ తెచ్చుకోగా తెలుగులో ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. రవితేజ, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో మీరా జాస్మిన్ కి జతకట్టే ఛాన్స్ దక్కింది. రవితేజకు జంటగా మీరా జాస్మిన్ నటించిన భద్ర మంచి విజయం అందుకుంది.

    బాలకృష్ణతో చేసిన మహారథి మాత్రం నిరాశపరిచింది. కాగా పవన్ కళ్యాణ్-మీరా జాస్మిన్ కాంబోలో గుడుంబా శంకర్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వీర శంకర్ దర్శకుడు. నాగబాబు నిర్మించారు. భారీ అంచనాల మధ్య 2004లో ఈ మూవీ విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కాగా గుడుంబా శంకర్ సెట్స్ లో మీరా జాస్మిన్ యాటిట్యూడ్ చూపించేదట. పవన్ కళ్యాణ్ వంటి బడా స్టార్ ముందు కూడా ఆమె ఫోజులు కొట్టారని ఓ నిర్మాత తెలియజేశాడు.

    మీరా జాస్మిన్ మంచి నటి అయినప్పటికీ ఆమె యాటిట్యూడ్ చూపుతారనే వాదన ఉంది. ఒక నిర్మాత ఈ విషయాన్ని ధృవీకరించాడు. మీరా జాస్మిన్ కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2014లో దుబాయ్ కి చెందిన జాన్ టైటస్ అనే ఇంజనీర్ ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతడికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. నటిగా కొన్నాళ్లు సిల్వర్ స్క్రీన్ కి దూరమైన మీరా… సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.