Visakhapatnam Railway Zone: ఆంధ్ర ప్రదేశ్ ఎప్పటి నుంచో ఎదరు చూస్తున్న ఓ విషయంలో కేంద్రం స్వీట్ న్యూస్ వినిపించింది. ఏపీ విభజన హామీల్లో ప్రధానమైనది విశాఖ రైల్వే జోన్. ఈ ప్రాజెక్టు మీద ఎప్పటి నుంచో రాజకీయ పార్టీల నడుమ వివాదాలు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు మీద పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రస్తావన తీసుకువచ్చారు.
ఆయన ప్రశ్నకు కేంద్రం స్పందిస్తూ… వైజాగ్ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో పాటు మరో స్వీట్ న్యూస్ కూడా వినిపించింది. అదేంటంటే.. వాల్తేర్ డివిజన్ స్థానంలో రాయగడ డివిజన్ ను నిర్మిస్తామని, ఆ ప్రతిపాదనలను కూడా ఓకే చెప్పింది. ఈ విషయాన్ని పార్లమెంట్ లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
Also Read: Vijaya Sai Reddy: ఉత్తరాంధ్రపై విజయసాయి పెత్తనమేమిటి? సీనియర్ నాయకుల గుస్సా
దాంతో పాటు విశాఖ రైల్వే జోన్ ను డెవలప్ చేసేందుకు ఆఫీసర్లతో కలిసి ఓ కమిటీని కూడా నియమిస్తామని వివరించారు. కాగా ఈ విశాఖ జోన్ ఏర్పాటుకు ఇప్పటికే సౌత్ కోస్టల్ రైల్వే ఓఎస్టీకి గైడ్ లైన్స్ ఇచ్చామని తెలిపారు. ఇక రైల్వే జోన్ లో.. ప్రధాన హెడ్ ఆఫీసులను నిర్మించేందుకు ఇప్పటికే స్థలాన్ని కూడా కేటాయిస్తున్నట్టు తెలిపారు.
ముందుగా అడ్మినిస్ట్రేటివ్, మేనేజ్ మెంట్ తో పాటుగా.. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతే.. రైల్వే జోన్ ఏర్పాటు, దాని పరిధిపై డిసిజన్ తీసుకుంటాన్నారు కేంద్ర మంత్రి. వీటన్నింటి తర్వాతే సౌత్ సెంట్రల్ రైల్వేను అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వేను విభజించి వైజాగ్ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ నిర్మిస్తామని వివరించారు. దాంతో పాటు ఏపీలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల మీద కూడా కేంద్రం స్పందించింది. కడప-బెంగుళూరుతో ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం తమ వాటా కింద నిధులు కేటాయించకపోవడం వల్లే ఆపేసినట్టు తెలిపారు మంత్రి.