https://oktelugu.com/

Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌ 2024 : భారీగా తగ్గనున్న సెల్‌ ఫోన్లు.. బంగారం, వెండి ధరలు.. ఏవీ పెరుగుతాయంటే?

కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను మంగళవారం(జూలై 23న) ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా ఆరోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 8 నెలల కాలానికి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ మొత్తం విలువ రూ. 32.07 లక్షల కోట్లు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 23, 2024 / 03:21 PM IST

    Union Budget 2024

    Follow us on

    Union Budget 2024: మూడోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించింది. ఇక 2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీ మెజారిటీ సీట్లు సాధించలేదు. ఎన్డీఏలోని టీడీపీ, జేడీఎస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో 2024 పూర్తి బడ్జెట్‌పై అన్నివర్గాల ప్రజలు ఆశగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగేలా పద్దును రూపొందించారు. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. వ్యవసాయరంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇందన భద్రత, మౌలికరంగం, పరిశోధన–ఆవిష్కరణలు, తయారీ, సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నిర్మలమ్మ వివరించారు.

    దిగిరాన్ను సెల్‌ఫోన్‌ ధరలు..
    ఇదిలా ఉండగా కేంద్ర ఆర్థిక మంత్రి ఎలక్ట్రానిక్‌ వస్తువులపై పన్ను శాతం భారీగా తగ్గించారు. ప్రధానంగా సెల్‌ఫోన్లు, సెల్‌ఫోన్‌ చార్జర్లపై బేసిక్‌ ట్యాక్స డ్యూటీని 15 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతోసెల్‌ఫోన్‌ ధరలు భారీగా తగ్గనున్నాయి. ప్రస్తుతం భారత్‌ ఏటా 10 కోట్ల మొబైల్‌ ఫోన్లను ఎగుమతి చేస్తుందని తెలిపారు. తాజాగ పన్న తగ్గింపుతో ఈ రంగం మరింత విస్తరిస్తుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అదే సమయంలో మొబైల్‌ ఫోన్ల ధరలు దిగివస్తాయని తెలిపారు.

    తగ్గనున్న బంగారం ధరలు..
    ఇక దేశంలో బంగారం ధరలు కొన్నేల్లుగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏటేటా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మధ్య తరగతి ప్రజలు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో బంగారం ఇప్పుడు సంపన్నుల ఇళ్లకే చేరుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్య తరగతి ప్రజలకు బడ్జెట్‌లో తీపికబురు చెప్పారు. బంగారం, వెండిపై 6 శాతం కస్టమ్స్‌ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్లాటినంపై కస్టమ్స్‌ డ్యూటీ 6.4 శాతం తగ్గిస్తామని తెలిపారు. దీంతో బంగారం, వెండి ధరలు దిగిరానున్నాయి. దీంతో మధ్య తరగతి ప్రజలకు కాస్త ఊరట లభించినట్లు అయింది.

    క్యాన్సర్‌ మందులపై పన్ను ఎత్తివేత..
    ఇదిలా ఉండగా, దేశంలో ఏటా క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణకు మహిళలకు ఉచింగా వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికైతే ఇది అమలులోకి రాలేదు. ఇక తాజా బడ్జెట్‌లో క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగించే మూడు రకాల మందులపై టాక్స్‌ పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

    25 రకాల ఖనిజాలపై కూడా..
    ఇక.. కేంద్ర బడ్జెట్‌లో 25 రకాల ఖనిజాలపై కూడా కస్టమ్స్‌ సుంఖాన్ని మినహాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇందులో ఏయే ఖనిజాలు ఉన్నాయనేది పూర్తి నివేదిక వస్తేనే స్పష్టత వస్తుంది.

    సోలార్‌ ప్యానెళ్లపై పన్ను తగ్గింపు..
    ఇక కేంద్రం సోలార్‌ విద్యుత్‌ను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కోటి ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే సోలార్‌ విద్యుత్‌ వినయోగం పెంచేందుకు తాజా బడ్జెట్‌లో సోలార్‌ విద్యుత్‌ ప్యానెళ్లపై ట్యాక్స్‌ను తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో తెలిపారు.

    ప్లాస్టిక్‌పై భారీగా సుంకం..
    ఇదిలా ఉంటే.. టెలికాం పరికరాలపై మాత్రం కేంద్రం కస్టమ్స్‌ సుంకాన్ని పెంచింది. ప్రస్తుతం 10 శాతం ఉన్న ట్యాక్స్‌ను 15 శాతానికి పెంచింది.

    – అమోనియం నైట్రైట్‌పై 10 శాతం, నాన్‌ బయోడిగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌పై కేంద్రం సుంఖాన్ని భారీగా పెంచింది. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక వాడకం తగ్గించాలన్న లక్ష్యంతో ప్లాస్టిక్‌పై సుంకాన్ని పెంచతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.