Sitara: ఆ వైద్య విద్యార్థిని కోసం.. మహేష్ కూతురు చేసిన పనికి అంతా ఫిదా.. సితార మంచి మనసుకు ప్రశంసలు…

సినిమా ఇండస్ట్రీ లో మహేష్ బాబు చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. నిజానికి ఆయన లాంటి అందగాడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరొకరు లేరు అనేది వాస్తవం...ఒక 15 సంవత్సరాల పాప (సితార) ఎంబిబిఎస్ చదివే స్టూడెంట్ కి హెల్ప్ చేయడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : July 23, 2024 3:17 pm

Sitara

Follow us on

Sitara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తన సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తండ్రి కి తగ్గ తనయుడిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం మంచి సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయ మనకు తెలిసిందే… అయితే మహేష్ బాబు ఎన్ని సినిమాలు చేసిన కూడా తనకు వచ్చే రెమ్యూనరేషన్ లో నుంచి కొంత భాగాన్ని పేద ప్రజలకు సహాయం చేస్తు ఉంటారు. ఇక అందులో భాగంగానే చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించడం లాంటివి చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి క్రమంలోనే తన కూతురు అయిన సితార కూడా ప్రస్తుతం కొన్ని జ్యూవెల్లరీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుంది. కాబట్టి తను కూడా తన రెమ్యూనరేషన్ లో కొంత భాగాన్ని పేద విద్యార్థులకు సహాయం చేస్తుందనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ఇక ఇప్పుడు అందులో భాగంగానే మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అయిన నీట్ లో 605 మార్కులు తెచ్చుకొని మంచి ర్యాంక్ సాధించిన నవ్య శ్రీ అనే అమ్మాయి వైద్య విద్యను అభ్యసించాలని అనుకుంటున్న సమయంలో ఆమెకి సితార అండగా నిలిచింది… మహేష్ బాబు ఫౌండేషన్ అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను నవ్య సంప్రదించింది. ఇక దీంతో నవ్య శ్రీ చదువులకు కావలసిన డబ్బులను సితార అరేంజ్ చేస్తానని చెప్పింది. ఇక ప్రస్తుతానికైతే ఒక లక్ష 25వేల రూపాయలను తనకు సహాయం గా అందించి ఇంకా ఏ అవసరం ఉన్నా కూడా తమ ట్రస్ట్ ద్వారా ఆమెకు హెల్ప్ చేస్తామంటూ తెలియజేసింది.

ఒక 15 సంవత్సరాల పాప (సితార) ఎంబిబిఎస్ చదివే స్టూడెంట్ కి హెల్ప్ చేయడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి. అయితే ఘట్టమనేని ఫ్యామిలీలో సూపర్ స్టార్ కృష్ణ కూడా పేదలకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఇక ఆయన తర్వాత వచ్చిన మహేష్ బాబు కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ఇక ఇప్పుడు తాత కృష్ణ , తండ్రి మహేష్ బాబు బాటలోనే సితార కూడా నడుస్తుంది. దాంతో పాటు గా చాలా మంది యూత్ కు ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. ఇక మొత్తానికైతే సితార సహాయం చేయడంతో అది చూసిన చాలామంది ఆమెను చూసి స్ఫూర్తి ని పొందడమే కాకుండా మరి కొంతమంది కూడా ఆమె బాటలోనే నడవడానికి సిద్ధమయ్యారు.

ఇక ఎప్పటికప్పుడు సితార సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులందరికీ అందుబాటులో ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే… ఇక వాళ్ళ నాన్న పాటలకు డ్యాన్సులు చేస్తుంది. అలాగే కొంత మందిని ఇంటర్వ్యూలు చేస్తూ, ఫన్నీ వీడియోలు కూడా చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. దీని ద్వారా ఆమె చాలా మంచి క్రేజ్ ను పొందడమే కాకుండా చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన వ్యక్తి గా మారిపోయింది.

ఇక ఇదంతా చూసిన మహేష్ బాబు అభిమానులు కూడా సితార ఇంత చిన్న వయసులోనే ఇలాంటి సహాయాలు చేస్తుందంటే చాలా గ్రేట్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…ఇక మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమాలో సితార ఒక చిన్న పాత్ర లో తళుక్కున మెరిసి అందరిని ఆకట్టుకుంది…