Homeజాతీయ వార్తలుసోనూ సూద్ నుంచి కేటీఆర్ కు ఊహించని స్పందన

సోనూ సూద్ నుంచి కేటీఆర్ కు ఊహించని స్పందన

కరోనా కల్లోలంలో దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నారు సోనూ సూద్. మొదటి వేవ్ నుంచి రెండో వేవ్ దాకా ఇప్పటికీ సోనూ సూద్ తన సేవలు కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా రియల్ హీరో అని అనిపించుకుంటున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనులు కూడా సోనూ సూద్ చేస్తున్నాడు. ఏకంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాడు.

సోషల్ మీడియాలో ఎవరు ఏం కోరినా కూడా సోనూసూద్ దేశవ్యాప్తంగా తన టీంతో సేవలందిస్తున్నాడు. వారి కష్టాలు తీరుస్తున్నాడు. ఇక సోనూ సూద్ అంతకాకపోయినా.. మంత్రి కేటీఆర్ తెలంగాణలోని సమస్యలపై, ఎవరైనా సాయం కోరితే తన కేటీఆర్ ఆఫీస్ ద్వారా అవన్నీ చక్కదిద్దుతున్నాడు.

ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్, సోనూసూద్ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు పొగిడేసుకొని హాట్ టాపిక్ గా మారారు.

మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ కు వచ్చే సమస్యలపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్ అవసరం అయితే కేటీఆర్ సమకూర్చారు. అతడు తన కృతజ్ఞతను సోషల్ మీడియాలోనే తెలిపారు. కేటీఆర్ ను రియల్ హీరో అని పొగిడారు.

దీనికి కేటీఆర్ బదులిచ్చాడు. ‘తాను ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కాబట్టి బాధ్యత నిర్వహిస్తున్నానని.. కానీ సోనూ సూద్ అలా కాదని.. ఆయనే రియల్ హీరో’ అని ప్రశంసించాడు.

మంత్రి కేటీఆర్ తనను పొగిడిన విషయాన్ని తెలుసుకొని సోనూసూద్ ఫిదా అయ్యాడు.తిరిగి కేటీఆర్ ను పొగిడారు. తెలంగాణ కోసం కేటీఆర్ ఎంతో శ్రమిస్తున్నారని అభినందించారు.మీ పాలనలో తెలంగాణలో ఎంతో అభివృద్ధి చెందిందని.. నా రెండో ఇళ్లు తెలంగాణ అని.. అక్కడ మీరు చేస్తున్న సేవలు చాలా గొప్పవని కేటీఆర్ ను ఆకాశానికెత్తేశాడు సోనూసూద్. ఇలా పరస్పరం పొగడ్తలతో ఇద్దరూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...

Rajamouli Next Movie: రాజమౌళి నెక్స్ట్ సినిమా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోందా…

Rajamouli Next Movie: ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా చేయడం...
Oktelugu Epaper
Exit mobile version