Hari Hara VeeraMallu : ‘హరి హర వీరమల్లు'(Hari Hara VeeraMallu) చిత్రం నుండి ఎట్టకేలకు ఒక పాటకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది వరకు విడుదలైన రెండు పాటలకు రెస్పాన్స్ అంతంత మాత్రం గానే వచ్చింది. ‘కొల్లగొట్టినాదిరో’ పాట పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారు, ఆరంభం లో ఈ పాటకు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ బాగా వచ్చాయి, అదే విధంగా యూట్యూబ్ షార్ట్ వీడియోస్ భారీ సంఖ్యలో వచ్చాయి. కానీ అదే ఊపు ముందుకు కొనసాగలేదు. మధ్యలోనే రీచ్ ఆగిపోయింది. దీంతో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఈ సినిమా పై అంచనాలు పెంచేలా ఒక్క కంటెంట్ కూడా రావడం లేదని సోషల్ మీడియా వేదికగా బాధపడ్డారు. అలాంటి సమయం లో నిన్న విడుదలైన ‘అసుర సంహారం’ పాటకు ఫ్యాన్స్ నుండి మాత్రమే కాకుండా, ఇతర హీరోల అభిమానుల నుండి కూడా మంచి రెస్పాన్స్ రావడం తో పవన్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : ఒకప్పుడు అలీ.. ఇప్పుడు హైపర్ ఆది..ట్రెండ్ కి తగట్టు టాలెంట్ ని ప్రోత్సహిస్తున్న పవన్ కళ్యాణ్
ఈ పాటకు తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషలకు కలిపి కేవలం 24 గంటల్లోనే 35 లక్షల వ్యూస్, మూడు లక్షల 11 వేల లైక్స్ వచ్చాయి. ఇన్ స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్ బుక్ ఇలా అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే యుద్ధ సమయం లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ఈ పాట వినిపించనుంది అట. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో దర్శక నిర్మాతలు ఈ విషయాన్నీ తెలియజేసారు. వచ్చే నెల 12 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ప్రొమోషన్స్ కి సమయం చాలా తక్కువ ఉండడం తో చేసే రెండు మూడు ఈవెంట్స్ ని అయినా గ్రాండ్ గా చెయ్యాలని చూస్తున్నారు. జూన్ మొదటి వారం తిరుపతి లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు.
ఇక ఆ తర్వాత నార్త్ ఇండియా మొత్తం ఈ సినిమా విడుదల అవుతుంది అనే విషయం తెలిసేలా, ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ కి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ముఖ్య అతిథి గా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి నుండి మొదలు కాబోతున్నాయి. ఈ సినిమా ఓపెనింగ్స్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అనేది ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని చూసి ఒక అంచనా కి రావొచ్చు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొదటి చిత్రం కావడంతో అభిమానులు ప్రతీ సెంటర్ లో ఆల్ టైం రికార్డు పెట్టాలనే కసితో ఉన్నారు. మరి ఆ రేంజ్ ఈ సినిమాకు ఉందా లేదా అనేది రేపటి ట్రెండ్ తో తెలిసిపోతుంది.
