శృతిమించిన లాక్ డౌన్ డ్యూటీ.. ఎస్ఐ సస్పెండ్

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌ డౌన్‌ ను విధించిన సంగతి తెలిసిందే. లాక్‌ డౌన్‌ ను సంపూర్ణంగా అమలు చేయడంలో భాగంగా ఓ ఎస్ఐ ఇద్దరు యువకులపై విచక్షణ రహితంగా లాఠీ ఛార్జీ చేశాడు. దీంతో ఉన్నతాధికారులు సదరు ఎస్ఐ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాయచోటి పట్టణంలో వరప్రసాద్ ట్రాఫిక్ ఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కరోనా లాక్‌ డౌన్ విధుల్లో […]

Written By: Neelambaram, Updated On : March 27, 2020 7:25 pm
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌ డౌన్‌ ను విధించిన సంగతి తెలిసిందే. లాక్‌ డౌన్‌ ను సంపూర్ణంగా అమలు చేయడంలో భాగంగా ఓ ఎస్ఐ ఇద్దరు యువకులపై విచక్షణ రహితంగా లాఠీ ఛార్జీ చేశాడు. దీంతో ఉన్నతాధికారులు సదరు ఎస్ఐ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాయచోటి పట్టణంలో వరప్రసాద్ ట్రాఫిక్ ఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కరోనా లాక్‌ డౌన్ విధుల్లో భాగంగా రాయచోటి పట్టణంలో బైక్‌ పై తిరుగుతున్న సమయంలో ఓ ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ఎదురుపడడంతో సదరు ఎస్ఐ వరప్రసాద్ లాఠీ ఛార్జీ చేయడంతో పాటు వాహనాన్ని ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. ఘటనపై ప్రాథమికంగా విచారణ జరిపేందుకు ఎస్ఐ వరప్రసాద్ను కడపకు పిలిచి విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఎస్పీ అన్బురాజన్ ప్రకటించారు.