తారక్ దుమ్ములేపాడంటున్న మెగాస్టార్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ టీంను మెగాస్టార్ ప్రశంసించారు. తారక్ ట్వీటర్లో విడుదల చేసిన వీడియో మెగాస్టార్ ను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఆయన ట్వీటర్లో తారక్ నువ్వు చెర్రీకి ఇచ్చిన గిఫ్ట్ ‘మా అందరిలో ఉత్సాహన్ని నింపింది.. తారక్ అమోఘం’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే దర్శకుడు రాజమౌళిపై ట్వీటర్లో మెగాస్టార్ ప్రశంసలు […]

Written By: Neelambaram, Updated On : March 27, 2020 6:54 pm
Follow us on

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ టీంను మెగాస్టార్ ప్రశంసించారు. తారక్ ట్వీటర్లో విడుదల చేసిన వీడియో మెగాస్టార్ ను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఆయన ట్వీటర్లో తారక్ నువ్వు చెర్రీకి ఇచ్చిన గిఫ్ట్ ‘మా అందరిలో ఉత్సాహన్ని నింపింది.. తారక్ అమోఘం’ అంటూ ట్వీట్ చేశారు.

అలాగే దర్శకుడు రాజమౌళిపై ట్వీటర్లో మెగాస్టార్ ప్రశంసలు కురించారు. ‘అదిరింది రాజమౌళి.. మీ అంబులపొది లోంచి వదిలిన రామబాణం ఈ సీతారామరాజు.. అమోఘం తారక్.. దుమ్ము లేపారు.. మాలో ఉత్సాహాన్ని నింపారు.. చరణ్‌కి ఎప్పటికీ గుర్తుండిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చారు తారక్.’ అని చిరు తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

నిజంగా తారక్ పోస్టు చేసిన వీడియో మెగాస్టార్ నే కాకుండా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానులందరిని మెస్మరైజ్ చేసేలా ఉంది. చెర్రీ అద్భుత నటనకు యంగ్ టైగర్ వాయిస్ తోడవడంతో డైలాగులు డైనమైట్ లా పేలాయి. ఈ వీడియో అటూ నందమూరి అభిమానులతోపాటు ఇటూ మెగా అభిమానులను అలరించిందనే చెప్పాలి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని ఆకట్టుందనే చెప్పాలి. ఎన్టీఆర్ చెప్పిన టైమ్‌కి విడుదల చేయలేకపోయినా, విడుదలైన తర్వాత మాత్రం సర్ ప్రైజ్ అదిరిపోయింది.