టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ వరుస ఆఫర్లుతో దూసుకుపోతుంది. గత దశాబ్దకాలంగా తెలుగు, తమిళం, బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బీజీగా మారింది. ఇటీవల కొత్త భామ రాకతో కాజల్ అగర్వాల్ హవా తగ్గింది. అంతేకాకుండా వయస్సు పైబడటంతో కేవలం సీనియర్ హీరో పక్కనే అవకాశాలు వస్తున్నాయి. అయినప్పటికీ ఈ భామ అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గకపోవడంతో మంచి ఆఫర్లు దక్కించుకుంటుంది. తాజాగా తమిళ హీరో విజయ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లలో పలు సినిమాలు వచ్చాయి.
మురగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించే ‘తుపాకీ’ సిక్వెల్లో తొలి పార్ట్ లో నటించే కాజల్ నే తీసుకునేందుకు చిత్రబృందం మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా కథకు సంబంధించిన పనులు జరుగుతున్నాయ. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాతోపాటు కాజల్ అగర్వాల్ మెగాస్టార్ సరసన ‘ఆచార్య’ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలోనూ కాజల్ అగర్వాల్ చిరంజీవి నటించిన ‘ఖైదీ-150’ మూవీలో నటించి మెప్పించింది. ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ని తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవి ఇందులో డ్యుయల్ రోల్స్ చేస్తుండగా రాంచరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాంచరణ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా చిరంజీవికి జోడి కాజల్ అగర్వాల్ నటిస్తుంది. కాజల్-చెర్రీ కాంబినేషన్లోనూ సూపర్ హిట్టు చిత్రాలున్నాయి. కాజల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ‘మగధీర’లో రాంచరణ్ కు జోడీ కాజల్ అగర్వాల్ నటించింది. ‘ఆచార్య’ మూవీని రాంచరణ్ మ్యాట్నీ ఎంటటైన్మెంట్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ‘ఆచార్య’ మూవీకి మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.