Unclaimed Deposits
Unclaimed Deposits : ఎల్‌ఐసీలో క్లెయిమ్ చేయని పాలసీలు అనేకం ఉన్నాయని, వాటిని తీసుకెళ్లాలని ఇటీవలే ఆ సంస్థ ప్రకటించింది. ఏళ్లు గడిచినా వివిధ కారనాలతో చాలా మంది వాటిని తీసుకోవడం లేదని తెలిపింది. ఇప్పుడు బ్యాంకుల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను ఆర్‌బీఐ(RBI) వెల్లడించింది.
Also Read : బ్యాంకుల్లో భారీగా నగదు.. ఎవరిదీ కాని సొమ్ము ఎన్ని కోట్లో తెలుసా?
దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ఖాతాదారులు ఉపసంహరించుకోని డిపాజిట్లు(Dipojits) బ్యాంకుల్లో భారీగా పేరుకుపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఖాతాదారుల్లో సరైన అవగాహన లేకపోవడమే. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దేశంలోని బ్యాంకు కార్యకలాపాలను నియంత్రిస్తుంది. బ్యాంకులు డిపాజిట్లు సేకరించి రుణాలు ఇవ్వడం ద్వారా వ్యాపారం నడుపుతాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, డిపాజిట్ ఖాతాలు కనీసం 7 రోజుల(7 Days) నుంచి గరిష్టంగా 10 ఏళ్ల(10 Years) వరకు ఉంటాయి. 2025 జనవరి నాటికి దేశంలోని బ్యాంకుల్లో మొత్తం 221.50 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి.
ఎలాంటి లావాదేవీలు జరగక..
పదేళ్లపాటు ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే, ఆ డబ్బును బ్యాంకులు ఆర్బీఐకి బదిలీ చేయాలి. ఈ నియమం ఖాతాదారుల డబ్బును సురక్షితంగా కాపాడటానికే. 2014లో ఆర్బీఐ ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’ను ఏర్పాటు చేసింది. ఈ ఫండ్‌లోకి బదిలీ అయిన ‘క్లెయిమ్(Claim) చేయని డిపాజిట్లు’ 2024 మార్చి నాటికి రూ.78,213 కోట్లకు చేరాయి. ఖాతాదారులు ఖాతాలను మూసివేయకపోవడం, డిపాజిట్లను ఉపసంహరించకపోవడం, మరణం తర్వాత వారసులు(Naminees) ముందుకు రాకపోవడం, విదేశాలకు వలస వెళ్లడం వంటి కారణాలతో ఈ సమస్య పెరుగుతోంది.
ఎప్పుడైనా తిరిగి పొందవచ్చు…
ఈ డబ్బును ఖాతాదారులు లేదా వారసులు ఎప్పుడైనా తిరిగి పొందవచ్చు. బ్యాంకు శాఖ ద్వారా దరఖాస్తు చేస్తే చాలు. అయినప్పటికీ, అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఈ డిపాజిట్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇందులో 80% ప్రభుత్వ బ్యాంకుల వాటా, ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికంగా ఉన్నాయి. 2023లో ఆర్బీఐ ‘100 రోజులు, 100 డిపాజిట్ చెల్లింపులు’ కార్యక్రమం ప్రారంభించినా, సమస్య ఇంకా కొనసాగుతోంది.
Also Read : మారిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు.. ఏఏ బ్యాంకు ఎంతెంత చెల్లిస్తుందంటే?