https://oktelugu.com/

Unclaimed Deposits: బ్యాంకుల్లో భారీగా నగదు.. ఎవరిదీ కాని సొమ్ము ఎన్ని కోట్లో తెలుసా?

సహకార బ్యాంకులతోపాటు వివిధ బ్యాంకుల్లో 10 ఏళ్ల, అంతకన్నా ఎక్కువ కాలం ఇన్‌ యాక్టివ్‌గా ఉన్న ఖాతాల్లోని సొమ్మును అన్‌ క్లెయిమ్డ్‌గా పరిగణిస్తారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 31, 2024 12:53 pm
    Unclaimed Deposits

    Unclaimed Deposits

    Follow us on

    Unclaimed Deposits: దేశంలోని వివిధ బ్యాంకుల్లో అన్‌ క్లెయిమ్డ్‌∙డిపాజిట్లు భారీగా పెరిగాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో అన్‌క్లెయిమ్డ్‌ వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2024, మార్చి నాటికి బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు 26 శాతం పెరిగాయి. మొత్తం రూ.78,213 కోట్లకు చేరాయి.

    అన్‌ క్లెయిమ్డ్‌ అంటే..
    సహకార బ్యాంకులతోపాటు వివిధ బ్యాంకుల్లో 10 ఏళ్ల, అంతకన్నా ఎక్కువ కాలం ఇన్‌ యాక్టివ్‌గా ఉన్న ఖాతాల్లోని సొమ్మును అన్‌ క్లెయిమ్డ్‌గా పరిగణిస్తారు. వీటిని ఆర్‌బీఐ డిపాజిటర్‌ ఎడ్యుషన్‌ అండ్‌ అవేర్నెస్‌ నిధికి బదిలీ చేస్తాయి. ఇలా 2023 మార్చి నాటికి yì పాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండఱ అవేర్నెస్‌ ఫండ్‌లోకి రూ.62,225 కోట్లు వదిలీ చేశారు.

    కొత్త మార్గదర్శకాలు..
    ఇదిలా ఉండగా ఖాతాదారులకు సహాయపడడానికి, ఇన్‌ యాక్టివ్‌ ఖాతాలకు సంబంధించిన ఇప్పటికే పలు సూచనలను బ్రమద్ధీకరించడానికి, రిజర్వు బ్యాంకు ఈ ఏడాది ప్రారంభంలో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. ఖాతాలు, డిపాజిట్లను ఇన్‌ యాక్టివ్‌ లేదా అన్‌ క్లెయిమ్డ్‌గా వర్గీకరిండంతోపాటు బ్యాంకులు అమలు చేయాల్సిన చర్యలను ఈ మార్గదర్శకాల్లో పొందుపర్చారు.

    అన్ని బ్యాంకులకు కొత్త మార్గదర్శకాలు..
    ఇక నవీకరించిన ఈ మార్గదర్శకాలు అన్ని వాణిజ్యం బ్యాంకులు(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతోపాటు), సహకార బ్యాంకులకు వర్తిస్తాయి. 2024 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి. వివిధ బ్యాంకుల్లో క్లెయిం చేయని డిపాజిట్లను కేంద్రీకృత పద్ధతిలో వెతికే ప్రక్రియను సులభతరం చేయడానికి రిజర్వు బ్యాంక్‌ ఉడ్గామ్‌(అన్‌ క్లెయిమ్డ్‌ డిపాజిట్‌స గేట్‌వే టు యాక్సెస్‌ ఇన్ఫర్మేషన్‌) అనే వెబ్‌ పోర్టల్‌ను రూపొందించింది.