https://oktelugu.com/

వాస్తవం తెలుసుకోకుండా నిందలేలా..?

భారత్ లో శాంతియుత ఆందోళనలు.. మీడియా స్వేచ్ఛపై బ్రిటన్ పార్లమెంటులో చేపట్టిన డిబేట్ వివాదానికి తెర తీసింది. ఈ చర్చను భారత్ తీవ్రంగా ఖండించింది. వాస్తావాలు తెలుసుకోకుండా ఏకపక్ష డిబేట్ నిర్వహించారని దుయ్యబట్టింది. భారత ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 100 రోజులుగా ఢిల్లీ జరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు లభించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో భారత్ లో ఆందోళనకారుల భద్రత, మీడియా స్వేచ్ఛపై బ్రిటీష్ ప్రభుత్వం సోమవారం […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 9, 2021 / 03:10 PM IST
    Follow us on


    భారత్ లో శాంతియుత ఆందోళనలు.. మీడియా స్వేచ్ఛపై బ్రిటన్ పార్లమెంటులో చేపట్టిన డిబేట్ వివాదానికి తెర తీసింది. ఈ చర్చను భారత్ తీవ్రంగా ఖండించింది. వాస్తావాలు తెలుసుకోకుండా ఏకపక్ష డిబేట్ నిర్వహించారని దుయ్యబట్టింది. భారత ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 100 రోజులుగా ఢిల్లీ జరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు లభించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో భారత్ లో ఆందోళనకారుల భద్రత, మీడియా స్వేచ్ఛపై బ్రిటీష్ ప్రభుత్వం సోమవారం 90 నిమిషాల పాటు డిబెట్ నిర్వహిచింది.

    Also Read: తమిళనాడులో వార్‌‌ వన్‌ సైడే.. సీఎం పీఠం ఆయనదే..!

    ఈ చర్చలో పలు బ్రిటీష్ పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొని నిరసనకారులు, జర్నలిస్టుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశార. ఆందోళనల కవరేజీ విషయంలో మీడియా ప్రతినిధులకు స్వేచ్ఛ లేదని ఆరోపించారు. ఇరు దేశాల ప్రధానులు ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు యూకే ఈ అంశాలను లేవనెత్తుతుందని ఆ దేశ మంత్రి నీగెల్ అడమ్స్ వెల్లడించారు.

    రైతుల ఆందోళన ఈ అంశంపై మీడియా కవరేజీపై నెలకొన్న అనిశ్చితి భారత మూలాలున్న బ్రిటీష్ కమ్యూనిటీలోనూ ఆందోళన కలిగిస్తోంది. మరికొద్ది నెలల్లో బోరిస్ జాన్సన్ భారత పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని ఆ దేశ ప్రధాని మన దేశ ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ లోగా భారత ప్రభుత్వం , రైతుల సంఘాల మధ్య చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నామని అడమ్స్ అన్నారు. ప్రతిపక్ష లేబర్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. ఈ విషషంయలో ఇరు వర్గాలు ఒక అడుగు వెనక్కి తగ్గించి ఒప్పందానికి రావాల్సిన అవసరం ఎంతైనా సూచలను ఇచ్చారు.

    Also Read: వైసీపీని టార్గెట్ చేసిన రిపబ్లిక్ టీవీ ఆర్నబ్..?

    అయితే ఈ డిబేట్ ను భారత్ ఖండించింది. సంయమన చర్చలకు బదులు తప్పడు వాదనలు చేయడాన్ని, నిజనిజాలు తెలుసుకోకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంపై నిందలు వేయడంపై మేం తీవ్రంగా చింతిస్తున్నామని లండన్ లో భారత హై కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ లో బ్రిటీష్ సహా అనేక విదేశీ మీడియా సంస్థలు ఉన్నాయని, అవన్నీ రైతుల ఆందోళనల గురించి ఎప్పటికప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని వివరించింది. అందువల్ల భారత్ లో మీడియాకు స్వేచ్ఛ కొరవడిందనే ప్రశ్నే రావొద్దని తెలిపింది. ఒకవేళ భారత్ పై ఎవరైనా నిందారోపణలు చేస్తే.. అవన్నీ నేరుగా చెప్పాలని ఘాటుగా సమాధానం ఇచ్చింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్