https://oktelugu.com/

ప్రత్యేక హోదా నుంచి విశాఖస్టీల్ వరకు.. ఏపీపై బీజేపీ శీతకన్ను..

తప్పనిసరి పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఏపీపై మొదటినుంచి కేంద్రం శీతకన్ను చూపుతోంది. తెలంగాణ నుంచి విడిపోయిన తరువాత ప్రత్యేకహోదా కల్పిస్తామని ఆశలు రేకెత్తించిన కేంద్రం ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు. నిధులు లేక.. ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయినా.. రాష్ర ప్రభుత్వం వ్యవహరాలను నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్న ఆర్థిక వనరులను సైతం కేంద్రం తాకట్టు పెడుతోంది.. అవసరమైతే అమ్మేస్తోంది. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖఉక్కు ఫ్యాక్టరీని ఎలాగైనా ప్రయివేటీకరణ చేసి తీరుతామని కేంద్ర […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 9, 2021 / 02:52 PM IST
    Follow us on


    తప్పనిసరి పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఏపీపై మొదటినుంచి కేంద్రం శీతకన్ను చూపుతోంది. తెలంగాణ నుంచి విడిపోయిన తరువాత ప్రత్యేకహోదా కల్పిస్తామని ఆశలు రేకెత్తించిన కేంద్రం ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు. నిధులు లేక.. ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయినా.. రాష్ర ప్రభుత్వం వ్యవహరాలను నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్న ఆర్థిక వనరులను సైతం కేంద్రం తాకట్టు పెడుతోంది.. అవసరమైతే అమ్మేస్తోంది. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖఉక్కు ఫ్యాక్టరీని ఎలాగైనా ప్రయివేటీకరణ చేసి తీరుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా లోక్ సభలో చేసిన ప్రకటన ఏపీపై బీజేపీ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోంది.

    Also Read: కేంద్రం ప్రకటనతో భగ్గుమన్న విశాఖ.. ఫైనాన్స్ డైరెక్టర్ ను పరుగులు పెట్టించిన ఆందోళనకారులు

    ధానపరమైన నిర్ణయమే అయినా.. నష్టాల్లో ఉన్న ప్రయివేటు రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఎన్డీఏ ప్రభుత్వం విధివిధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ.. కోట్లాది మంది తెలుగు ప్రజల మనోభావాలను గౌరవించకపోవడం.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎలా లాభాల్లోకి తీసుకురావాలనే అంశాన్ని పట్టించుకోకపోవడం .. ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. సుదీర్ఘకాలంపాటు స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు… రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న నిరసనలు.. ఆందోళనను కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని నిర్మలా సీతారామన్ ప్రకటనతో తేటతెల్లమైంది.

    ఇదివరకు ప్రత్యేకహోదా ఇస్తామంటూ.. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రకటన ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటూ.. అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్రంలో అధికార మార్పిడి తరువాత నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకుని తరువాత యూపీఏ సర్కార్ ఇచ్చిన విభజన చట్టం హామీని అమలు చేయడం లేదు. విభజన నిర్ణయం తీసుకుంది యూపీఏ హయాంలో అయినప్పటికీ.. సమర్థించింది మాత్రం అప్పటి ప్రతిపక్ష ఎన్డీఏ కూటమే. విభజన అనేది సీమాంధ్రుల ఇష్టానికి వ్యతిరేకమే అయినప్పటికీ.. మాటిచ్చి గద్దెనెక్కిన ఎన్డీ ఏ కూటమి దాన్ని అమలు చేయడం లేదు.

    Also Read: వైసీపీని టార్గెట్ చేసిన రిపబ్లిక్ టీవీ ఆర్నబ్..?

    హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని తెరపైకి తెచ్చింది కేంద్రం. ఆ పేరుతో ఐదేళ్లు కాలక్షేపం చేసింది. ఇదే సమయంలో సంస్థల ప్రయివేటీకరణకు పూనుకుంటోంది. వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడానికి కీలకంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటీకరించేందుకు సిద్ధమైంది. ఉన్నవాటిని కూడా ప్రయివేటీకరించడం వల్ల రాష్ట్రంపై మోదీ ప్రభుత్వానికి ఎంతమేరకు ప్రేమ ఉందో అర్థం అవుతోంది. ఫ్యాక్టరీని నష్టాలొచ్చినందుకే ప్రయివేటీకరిస్తున్నామని చెబుతున్నా కేంద్రం.. నష్టాలను పూడ్చుకుని లాభాల దిశగా తీసుకునే ప్రయత్నాలను గురించి ఆలోచన చేయడం లేదు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్