వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని కేంద్రం కుండబద్దలు కొట్టిన వేళ ఏపీ భగ్గుమంది. ఆందోళనలు మిన్నంటాయి. ఏపీ ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరిపామన్న కేంద్రం ప్రకటన ఆందోళనకారులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కూడా ఇరుకునపడింది.
ఈ క్రమంలోనే ఈ ఉపద్రవం నుంచి బయటపడేందుకు సీఎం జగన్ అలెర్ట్ అయ్యారు. వెంటనే ప్రైవేటీకరణను ఆపాలని తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై సీఎం జగన్ తాజాగా ప్రధాని మోడీకి మరోసారి లేఖ రాశారు. తన పాపం కడిగేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని.. కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని లేఖలో కోరారు. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇస్తే తనతోపాటు అఖిలపక్షాన్ని కూడా తీసుకువస్తానని పేర్కొన్నారు.
దీంతో క్రతువులో తనతోపాటు ప్రతిపక్షాలు, అఖిలపక్షాన్ని ఇన్వాల్వ్ చేసి సీఎం జగన్ చాకచక్యంగా తప్పించుకున్నారు. తనపై మచ్చ రాకుండా.. తనకు మాట రాకుండా జగన్ చాకచక్యంగా బీజేపీని కార్నర్ చేసి దెబ్బకొట్టారు. వైసీపీకి తెలిసే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ ఉపద్రవం నుంచి లేఖ రాసి జగన్ ఎస్కేప్ అయ్యారని చెప్పాలి.
విశాఖ ప్రైవేటీకరణ విషయంలో ఇప్పుడు బీజేపీయే ప్రజల ముందు దోషి అని నిరూపించడం జగన్ సక్సెస్ అయ్యారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ పై పార్లమెంట్ లో ప్రశ్న అడిగింది వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణే. తాజాగా ప్రైవేటీకరణ వద్దని.. అఖిలపక్షంతో పోరుకు రెడీ అయ్యింది సీఎం జగన్. సో ఈ ప్రజాగ్రహం తనవైపుకు రాకుండా జగన్ చాకచక్యంగా తప్పించుకున్నాడని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.