spot_img
Homeజాతీయ వార్తలుUday Kotak Success Story: ఉదయ్ కోటక్ కథ : క్రికెటర్‌గా ఓడిపోయాడు.. బ్యాంకర్‌గా విన్‌...

Uday Kotak Success Story: ఉదయ్ కోటక్ కథ : క్రికెటర్‌గా ఓడిపోయాడు.. బ్యాంకర్‌గా విన్‌ అయ్యాడు..!

Uday Kotak Success Story: మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి.. బాగా ఫేమస్‌ డైలాగ్‌ ఇదీ. ప్రతీ మనిషిలో ఒక టాలెంట్‌ ఉంటుంది. దానిని బయటకు తీసి.. సానబెట్టి.. పట్టు సాధించిన వ్యక్తి విజేగా నిలుస్తాడు. గుర్తించలేనివాడు ఫెయిల్యూర్‌గా నిలుస్తాడు. ఫెయిల్యూర్‌ తర్వాత కూడా వైఫల్యానికి కుంగిపోకుండా పట్టుదలతో అంతర్గత సృజనను వెలికి తీస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అలా వైఫల్యం నుంచి విజేతగా నిలిచన వ్యక్తి ఉదయ్‌ కోటక్‌. మధ్యతరగతి నుంచి భారతీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగంలో అగ్రస్థానానికి ఎదగడం సామాన్య విషయం కాదు.. క్రికెట్‌ కావాలన్న స్వప్నం చెదిరిపోయినా వ్యాపార రంగంలో 40 ఏళ్ల పోరాటంతో 68 బిలియన్‌ డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు.

Also Read: ‘విష్ణు విన్యాసం’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..ఫ్లాప్ టాక్ తో మాస్ ర్యాంపేజ్!

60 మంది కుటుంబంలో శిక్షణ
1959 మార్చి 15న గుజరాత్‌లో పత్తి వ్యాపారం చేసే మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఉదయ్‌ కోటక్‌. 60 మంది సభ్యులు ఒకే హాల్, కిచెన్‌లో సర్దుకుని పెరిగారు. పిల్లలు ఒకే కారులో స్కూల్‌. కుటుంబ విలువలు, సామూహికత పాఠాలు ఆయన్ని ధైర్యవంతుడిని చేశాయి.

క్రికెట్‌ అభిరుచిగా..
ఉదయ్‌ కోటక్‌ క్రికెటర్‌ కావాలని ఆరో తరగతి నుంచి రమాకాంత్‌ ఆచ్రేకర్‌ (సచిన్‌ గురువు) దగ్గర కఠిన శిక్షణ తీసుకున్నాడు. కాలేజీ కెప్టెన్, రంజీ స్థాయి చేరుకున్నారు. కానీ కాంగా లీగ్‌ మ్యాచ్‌లో తలపై బంతి తగిలి రక్తస్రావం, బ్రెయిన్‌ సర్జరీ అయింది. కొన్ని రోజులు పక్షవాతంతో బాధపడ్డాడు. కోలుకున్నాక క్రికెట్‌ కల చెదిరిపోయింది. తర్వాత జమ్నాలాల్‌ బజాజ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఎంబీఏ పూర్తి చేశారు.

చిన్న అప్పుతో వ్యాపార ప్రయాణం..
ప్రొఫెసర్‌ శివానందన్‌ మాంకేకర్‌ ప్రేరణతో స్టాక్‌ మార్కెట్‌ పాఠాలు నేర్చుకున్నాడు. తర్వాత హిందుస్థాన్‌ యూనిలీవర్‌లో జాబ్‌ వచ్చినా తిరస్కరించాడు. 1985లో 30 లక్షల (సుమారు 80,000 డాలర్లు) అప్పులతో కోటక్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ ఫైనాన్స్‌ ప్రారంభించాడు. బిల్‌ డిస్కౌంటింగ్‌తో మొదలుపెట్టి టాటా–నెల్కో, మారుతీ క్లయింట్లుగా మార్చారు. కార్‌ లోన్లకు వినూత్న మోడల్‌ కార్లు అందించి ఫైనాన్స్‌ బాంధ్యత పెట్టారు.

అనేక సవాళ్లు ఎదుర్కొని..
హర్షద్‌ మెహతా స్కామ్‌(1992) తర్వాత కఠిన నియమాలు, పోటీ, 2008 ఆర్థిక మాంద్యం ఎదుర్కొన్నారు. బీమా, బ్రోకరేజ్, అసెట్‌ మేనేజ్‌మెంట్, మ్యూచువల్‌ ఫండ్స్‌లో విస్తరణ. 2003లో ఆర్‌బీఐ నుంచి మొదటి ఎన్‌బీఎఫ్‌సీకి బ్యాంక్‌ లైసెన్స్‌ పొంది కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఏర్పాటు చేశారు. 2014లో ఐఎన్‌జీ విస్యా ఆక్విజిషన్‌ (2.4 బిలియన్‌ డాలర్లు), 2015లో జనరల్‌ ఇన్సూరెన్స్, భారతి ఎయిర్‌టెల్‌తో పేమెంట్స్‌ బ్యాంక్‌ స్థాపించారు.

మహీంద్రా భాగస్వామ్యం..
ఆనంద్‌ మహీంద్రా (హార్వర్డ్‌ గ్రాడ్యుయేట్‌) పెట్టుబడి పెట్టి పేరు అనుమతించారు. ఇది బ్రాండ్‌ గుర్తింపు, విశ్వాసాన్ని పెంచింది. 2023 సెప్టెంబర్‌లో సీఈవో పదవి వదులుకుని నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఇప్పుడు 1752 బ్రాంచ్‌లు, 60 వేల ఉద్యోగులు, మార్కెట్‌ క్యాప్‌లో 3వ స్థానంలో ఉంది.

ఉదయ్‌ కోటక్‌ విజయం ధైర్యం, రిస్క్‌ మేనేజ్‌మెంట్, కస్టమర్‌ ఫోకస్‌కు చిహ్నం. 40 శాతం సీఏజీఆర్‌ ఇన్వెస్టర్లకు రాబడి. కోటక్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌తో పేదల ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్‌ ప్రోగ్రామ్‌లు. యువతకు సందేశం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular