Teacher Student Love in UP: కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే కలికాలం అంటే ఇదేనేమో అనే అనుమానాలు వస్తున్నాయి. నేటి తరంలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే స్టడెంట్లతో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. అయితే ఇప్పుడు చెప్పబోయేది అంతకు మించిన ఘటన. ఒక అమ్మాయి కోసం ఇద్దరు టీచర్లు పోటీ పడ్డారు. చివరకు ఒకరిని మరొకరు చంపేసి, ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది.

యూపీలోని మీర్జాపుర జిల్లాలో ఉండే కురైథి ప్రాంతంలో ఓ ఫేమస్ ప్రైవేట్ స్కూల్ ఉంది. ఈ స్కూల్ లో చదువుతున్న ఓ అమ్మాయిని.. అదే స్కూల్‌కు చెందిన ఇద్దరు టీచర్లు సూరజ్, అనూజ్ లు ప్రేమించారు. అయితే ఒకిరికి తెలియకుండా మరొకరు ఆమెను ప్రేమిస్తున్నారు. ఆ అమ్మాయి మత్రం సూరజ్‌ను ప్రేమిస్తున్నట్టు తెలిసింది.
Also Read: సీఎం కుర్చీ వద్దు.. నన్ను చంపేందుకు రెక్కీ చేస్తున్నారు.. సంజయ్ సంచలన కామెంట్స్
ఇలా ఆ ఇద్దరు టీచర్లు దాదాపు మూడేండ్లుగా అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఈ క్రమంలోనే సూరజ్ ప్రేమిస్తున్న సంగతి అనూజ్‌కు తెలిసి రగిలిపోయాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. కాగా ఆ అమ్మాయి తననే ప్రేమిస్తోందని, నీది వన్ సైడ్ లవ్ అంటూ సూరజ్ చెప్పాడు. దీంతో మరింత రగిలిపోయిన అనూజ్.. తన ప్రేమకు అడ్డు వస్తున్న సూరజ్‌ను చంపేయాలని తన ఫ్రెండ్ సాయంతో పథకం రూపొందించాడు.
ఇలా ఫ్రెండ్ సాయంతో అనూజ్ తన తోటి టీచర్ అయిన సూరజ్‌ను చంపేశాడు. అనంతరం పోలీసులకు, స్కూల్ లో తెలిస్తే పరువు పోతుందని భయపడిపోయాడు. ఆ భయంతో తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. దీంతో ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది.ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఇద్దరు టీచర్లు తనను ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలుసా లేదా అన్నది తెలియరావట్లేదు. ఇదంతా అమ్మాయికి తెలిసే జరిగిందా అనే అనుమానాలు కూడా తెరమదకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన సంచలనం రేపుతోంది.