Telangana CM: తెలంగాణ సీఎం ఎంపికకు ముందు ట్విస్ట్‌.. కుర్చీ కోసం ఢిల్లీ వెళ్లిన ఆ ఇద్దరు సీనియర్లు

తెలంగాణ సీఎం ఎంపికకు ముంద..మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవరం వేకువజామున ఢిల్లీ బయల్దేరడం ఆసక్తిగా మారింది. అధిష్టానం పిలుపు మేరకు వారు ఢిల్లీ వెళ్లారా.. లేక తమ పేరు పరిశీలించాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్లారా అన్న చర్చ టీకాంగ్రెస్‌లో మొదలైంది.

Written By: Raj Shekar, Updated On : December 5, 2023 10:23 am

Telangana CM

Follow us on

Telangana CM: తెలంగాణ సీఎం ఎవరో ఈరోజు తేలుపోతుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయంతో సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన డీకే.శివకుమార్‌ ఈరోజు అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. మధ్యాహ్నం నిర్వహించే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుని సీఎం ఎవరో ప్రకటించే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో ఇద్దరు నేతలు మంగళవారం ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కడంతో ట్విస్ట్‌ నెలకొంది.

హస్తినకు భట్టి, ఉత్తమ్‌..
తెలంగాణ సీఎం ఎంపికకు ముంద..మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవరం వేకువజామున ఢిల్లీ బయల్దేరడం ఆసక్తిగా మారింది. అధిష్టానం పిలుపు మేరకు వారు ఢిల్లీ వెళ్లారా.. లేక తమ పేరు పరిశీలించాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్లారా అన్న చర్చ టీకాంగ్రెస్‌లో మొదలైంది. ఎమ్మెల్యే టిక్కెట్ల జారీ సమయంలోనూ ఇలాకే కొంతమందిని ఢిల్లీ పిలిపించి.. కొందరికి టికెట్‌ ఇవ్వగా, కొందరికి టికెట్‌ రాదని నచ్చజెప్పింది.

బుజ్జగింపు ఎవరికి.. పదవి ఎవరికి?
ఢిల్లీ వెళ్లిన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలో ఇద్దరినీ బుజ్జగించి రేవంత్‌ కోసం అధిష్టానం ఒప్పిస్తుందా.. లేక ఉత్తమ్, భట్టిలో ఎవరినైనా సీఎంగా ప్రకటించే అవకాశం ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది. దళిత సీఎం అని ఎన్నికల ముందురోజే ఇండికేషన్‌ ఇచ్చిన నేపథ్యంలో భట్టిని అధిష్టానం ఢిల్లీకి పిలిపించి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు సీనియారిటీ ప్రాతిపదికన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవి ఇచ్చి.. భట్టికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా కొంతమంది భావిస్తున్నారు. ఇక రేవంత్‌ వర్గం మాత్రం.. ఇద్దరికీ నచ్చజెప్పేందుకు అధిష్టానం ఇద్దరికీ ఢిల్లీ నుంచి కబురు పంపించి ఉంటుందని పేర్కొంటున్నారు. కీలక మీటింగ్‌ జరిగే ముందు సీఎం రేసులో ఉన్న ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్లడం.. కాంగ్రెస్‌లో అనేక చర్చలకు కారణమవుతోంది.