HomeతెలంగాణBRS: కారు పార్టీకి మరింత కష్టకాలం!

BRS: కారు పార్టీకి మరింత కష్టకాలం!

BRS: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన సత్తాను రాబోయే ఎన్నికల్లోనూ ప్రదర్శించాలని తాపత్రయపడుతోంది.. సరిగ్గా ఇక్కడే కారు పార్టీకి భవిష్యత్తులో అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పాటు దానికి బిజెపి నుంచి కూడా అనేక సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బిజెపి తన బలాన్ని పెంచుకుంది. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇంకా తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు వారు గత గణాంకాలను ఉదాహరణగా చూపుతున్నారు.

11 స్థానాల్లో..

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 111 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. ఓటు శాతాన్ని 13.9కి పెంచుకుంది. 8 స్థానాల్లో విజయ్ కేతన ఎగరవేసింది. గతంలో పార్టీ క్యాడర్ ను పరుగులెత్తించిన బండి సంజయ్ ని ఎన్నికల ముందు తప్పించి.. రాష్ట్ర పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డికి అప్పగించినప్పటికీ.. ఆ పార్టీ 20 వేల నుంచి లక్షకు పైగా ఓట్లు సాధించిన నియోజకవర్గాలు 58 వరకు ఉన్నాయి. అలాగే పదివేల నుంచి 20వేల మధ్య ఓట్లు సాధించిన సీట్లు 25 కు పైగా.. 10 నుంచి 15% ఎక్కువ ఓట్లు సాధించిన నియోజకవర్గాలు పదికి పైగా.. 15 నుంచి 25 శాతం ఓట్లు సాధించిన సీట్లు 25 దాకా ఉన్నాయి. అయితే ఈ ఓట్ల శాతాన్ని బట్టి పార్టీ కనుక మరింత సీరియస్గా దృష్టి పెడితే బలం పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు అది భవిష్యత్తు కాలంలో భారతీయ రాష్ట్ర సమితి ప్రాబల్యాన్ని.. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. కమలనాధుల జోరును తట్టుకొని నిలబడితే తప్ప భారత రాష్ట్ర సమితికి భవిష్యత్తులో మనుగడ కష్టమే అని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. కేవలం భారత రాష్ట్ర సమితికి మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఎన్నికల్లో పలుచోట్ల గెలుపు అవకాశాలకు బిజెపి గండి కొట్టింది. ఉదాహరణకు గ్రేటర్ పరిధిలో చూసుకుంటే 28 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వాటిల్లో ఒకచోట కూడా కాంగ్రెస్ పార్టీ గెలవకుండా బిజెపి ధైర్యంగా అడ్డుకోగలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పలుచోట్ల త్రిముఖ పోరు చోటుచేసుకుంది. ఇలా సుమారు 50కి పైగా నియోజకవర్గాలలో బిజెపి గట్టి పోటీ ఇచ్చింది.

లెక్క ప్రకారం చూసుకుంటే..

భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం 9 సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. అలాంటప్పుడు 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఆ తొమ్మిది స్థానాలను భారత రాష్ట్ర సమితి నిలబెట్టుకోవడం దాదాపు కష్టమే. ఎందుకంటే ఆ సిట్టింగ్ స్థానాల్లోని మూడు సీట్ల పరిధిలో మాత్రమే భారత రాష్ట్ర సమితి తన ఆదిత్యాన్ని ప్రదర్శించింది. పార్లమెంట్ ఎన్నికల విషయానికొస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇక తెలంగాణలో బిజెపికి మోడీ కరిష్మా తోడవుతుంది. అర్థం గా మూడు స్థానాల్లో విజయం సాధించడం కారు పార్టీకి కష్టంగా మారుతుంది. గణాంకాల ప్రకారం పరిశీలిస్తే రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి నాలుగు, కాంగ్రెస్ మూడు, ఎంఐఎం ఒకచోట విజయం సాధించాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంటు స్థానాల వారీగా పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ పది పార్లమెంటు స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లల్లో భారీ మెజారిటీ సాధించింది. ఇందులో పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ, భువన గిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఉన్నాయి. వీటిలో భువనగిరి, ఖమ్మం పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి రావడం వల్ల మిగతా ఎనిమిది చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి విజయాకాశాలు మెరుగవుతాయి. ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గం చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ నమోదు చేసింది. అలాగే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోని కొడంగల్, నారాయణపేట్, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్ నగర్ స్థానాలు ఎన్నికల్లో హస్తగతమయ్యాయి. నల్లగొండ పార్లమెంట్ స్థానం పరిధిలో ఈడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.. ఒక సూర్యాపేటలోనే భారత రాష్ట్ర సమితి గెలిచింది. ఇక భువనగిరి పరిధిలో ఒక జనగామలో మాత్రమే భారత రాష్ట్ర సమితి విజయం సాధించింది. వరంగల్ పార్లమెంటు స్థానం పరిధిలో స్టేషన్ ఘన్ పూర్ లో మాత్రమే భారత రాష్ట్ర సమితి విజయం సాధించింది. ఇక ఖమ్మం పరిధిలోని ఏడు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version