రెండు తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఏ ఛానల్ అని చిన్న పిల్లవాడిని అడిగినా తడుముకోకుండా టీవీ9 అని టక్కున చెప్పేస్తాడు. అనతి కాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 ఛానల్ తెచ్చుకున్న గుర్తింపు అంతాఇంతా కాదు. అయితే గతేడాది టీవీ9 యాజమాన్యం మారడం, కొత్త యాజమాన్యం టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై సంచలన ఆరోపణలు చేయడం, పోలీస్ కేసులతో ఈ వివాదం అనేక మలుపులు తిరగడం గురించి తెలిసిందే.
Also Read : హైదరాబాద్ కు మహర్ధశ
అయితే తాజాగా రవిప్రకాష్ లా ట్రిబ్యునల్ లో ఒక పిటిషన్ దాఖలు చేసి తాను లాభాల్లో నడిపించిన టీవీ9 సంస్థ ప్రస్తుతం నష్టాల్లో ఉందని…. సంస్థ వాల్యుయేషన్ రిపోర్ట్ ప్రకారం మరో నాలుగేళ్ల వరకు నష్టాలు తప్పవని యాజమాన్యమే చెబుతోందని…. తాను సీఈఓగా ఉన్న సమయంలో షేరు ధర 270 రూపాయలు కాగా ఇప్పుడు ఆ ధర 78 రూపాయలకు పతనమైందని… కొత్త యాజమాన్యం అనుభవ రాహిత్యం వల్ల షేర్ హోల్డర్ అయిన తాను తీవ్రంగా నష్టపోతున్నానని పిటిషన్ లో పేర్కొన్నాడు.
సంస్థ రవిప్రకాష్ ను గతంలోనే తప్పించినా నేటికీ సంస్థలో ఆయనకు వాటాలు ఉన్నాయి. దీంతో 78 రూపాయల షేర్ ధరతో వాళ్ల వాటాను తనకు అమ్మేస్తే టీవీ9 మొత్తాన్ని టేకోవర్ చేస్తానని రవిప్రకాష్ పేర్కొన్నాడు. రవిప్రకాష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా ఆ పిటిషన్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. బలమైన వ్యక్తుల చేతిలో టీవీ9 ఉండటంతో వాళ్లు వాటాలు అమ్మడానికి ఇష్టపడరు.
500 కోట్ల రూపాయలతో టీవీ9ను అలందా మీడియా కొనుగోలు చేసింది నష్టాలకు అమ్మడానికి ఎంత మాత్రం కాదు. టీవీ9 షేర్లు ఓపెన్ మార్కెట్ షేర్లు కావు. ప్రధాన వాటాదారులుగా ఉన్న మై హోం, మేఘా గ్రూపులు అమ్మాలనే ఆలోచన ఉన్నా రవిప్రకాష్ కు మాత్రం అమ్మడానికి అస్సలు ఇష్టపడవు. ఈ పిటిషన్ ద్వారా రవిప్రకాష్ ఉనికి చాటుకోవడం మినహా పెద్దగా ప్రయోజనం చేకూరదనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
Also Read : అక్టోబర్ 16 నాడే ఎంగిలిపూల బతుకమ్మ
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Tv9 will not go into raviprakashs hands because
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com