
మెగా బ్రదర్స్ ముగ్గురిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్టార్ హీరోలుగా ఎదిగితే నాగబాబు మాత్రం హీరోగా ట్రై చేసినా సక్సెస్ కాలేకపోయారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ, పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ నాగబాబు తన ఉనికిని చాటుకుంటున్నారు. అయితే నాగబాబు హీరోగా సక్సెస్ కాలేకపోయినా ఆయన కొడుకు వరుణ్ తేజ్ మాత్రం వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.
Also Read : పవన్ కు అవమానం.. పోలీస్ గడపతొక్కిన జనసేన
చాలా సంవత్సరాల పాటు జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు కొన్ని కారణాల వల్ల ఆ షో నుంచి తప్పుకుని జీ తెలుగు ఛానల్ లోని అదిరింది షోకు ప్రస్తుతం జడ్జిగా ఉన్నారు. ఖాళీ సమయాల్లో సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా వేర్వేరు విషయాలపై స్పందిస్తూ నాగబాబు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే నాగబాబు చేసిన పలు వీడియోలపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైన సందర్భాలు సైతం ఉన్నాయి.
వివాదాస్పద అంశాల గురించి నాగబాబు మాట్లాడిన సమయంలో ఆయన గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. గతంలో బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని నాగబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమయ్యాయి. నాగబాబు అభిమానులు బాలయ్యపై విరుచుకుపడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని నెలల తరువాత చిరంజీవి, నాగార్జున, మరి కొందరు సినీ ప్రముఖులు తనను పిలవకుండా తెలంగాణ ప్రభుత్వ పెద్దలను కలవడంపై బాలయ్య స్పందిస్తూ భూములు పంచుకోవడం కోసమే కలిశారని వ్యాఖ్యలు చేయగా నాగబాబు బాలకృష్ణ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే తాజాగా నాగబాబు “నందమూరి సింహాన్ని పవర్‌స్టార్ కలిసిన రోజు” అంటూ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కలిసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే గతంలో బాలయ్య ఎవరో తెలియదని… బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు ఇప్పుడు బాలకృష్ణను నందమూరి సింహం అంటూ చెప్పడంపై నిన్నమొన్నటివరకు తిట్టిన మనిషిని పొగడటానికి నాగబాబు ఇంతలా దిగజారాలా….? అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
Also Read : ‘గుండు’ సీక్రెట్ ను రివీల్ చేసిన మెగాస్టార్..!