Homeజాతీయ వార్తలుRavi Prakash : టీవీ9 లోగో కేసు..168 కోట్లు కావాలంటున్న రవి ప్రకాష్..

Ravi Prakash : టీవీ9 లోగో కేసు..168 కోట్లు కావాలంటున్న రవి ప్రకాష్..

Ravi Prakash : ఎలక్ట్రానిక్ మీడియాలో రవి ప్రకాష్ ఒక సంచలనం. పోకిరి సినిమాలో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అన్నట్టుగా.. తన స్థాయి ఏమిటో ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించాడు. ఇది అది అని కాదు.. ప్రతి దానిని ఒక వార్తలాగా మలిచాడు. సంచలన జర్నలిజానికి ప్రాధాన్యం ఇస్తూనే.. లోతైన విశ్లేషణకు అవకాశం కల్పించాడు.. జనాలకు కిక్కు ఎక్కించేలాగా వార్తలను మలిచాడు. ఊహించని వేగాన్ని.. ఉరుము లాంటి ధ్వనిని.. మెరుపులాంటి వెలుగును రంగరించి వార్తకు జోడించాడు. రవి ప్రకాష్ అందువల్లే ఒక బ్రాండ్ లాగా అవతరించాడు.

Also Read : రవి ప్రకాష్ పై ఉచ్చు బిగించిన మెఘా.. రంగంలోకి యూరో ఎగ్జిమ్ బ్యాంక్..


టీవీ9 అనే సంస్థను ఏర్పాటు చేశాడు. దానిని అంతకంతకు విస్తరించాడు. కానీ అతడి వేగానికి బ్రేకులు పడ్డాయి. టీవీ9ను అయితే అతడు స్థాపించాడో.. అందులో నుంచి బయటికి వెళ్లిపోయాడు.. బయటికి వెళ్లి పోవాల్సిన పరిస్థితి రావడంతో వెళ్ళిపోయాడు.. ఇక కొన్ని గంటల క్రితం రవి ప్రకాష్ ఒక ట్విట్ చేశాడు.. తన టీవీ9 లోగో వాడకానికి పరిహారం చెల్లించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. లోగో విషయంలోనే కాదు, వాటా విషయంలోనూ ABCPL తో యుద్ధం సాగిస్తున్నాడు.. అంతేకాదు టీవీ9 నెట్వర్క్, టీవీ9 మేనేజ్మెంట్ పై కాపీరైట్ విషయంలో రవి ప్రకాష్ ఢిల్లీ హైకోర్టును గతంలోనే ఆశ్రయించాడు.. దీనికి సంబంధించి కోర్టులో విచారణ కొనసాగుతోంది.. లోగో వివాదం పై ఢిల్లీ హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు ఇచ్చింది. టీవీ9 మాతృ సంస్థ ఏబీసీఎల్ (అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్) నిబంధనలు ఉల్లంఘించిన విషయంలో టీవీ9 ఫౌండర్ రవి ప్రకాష్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఎం టీవీ9 లోగో వినియోగించినందుకు గాను ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు శాతం రెవెన్యూ ఇవ్వాలని రవి ప్రకాష్ తన ఫిర్యాదులో స్పష్టం చేశారు.. టీవీ9 లోగోను 2019 అనంతరం ఎబిసిఎల్ వినియోగించే అవకాశం లేదు. లోగో కాపీరైట్ తన పేరు మీదికి మార్చాలని రవి ప్రకాష్ తన ఫిర్యాదులు వెల్లడించారు. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు టీవీ9 మాతృ సంస్థ ఏబీసీఎల్ కు దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసింది.. లోగో విషయంలో, 168 కోట్ల చెల్లింపు విషయంలో ఢిల్లీ హైకోర్టులకు ఆదేశాలు ఇచ్చింది. భవిష్యత్తు కాలంలో టీవీ9 లోగో పై హక్కులను రవి ప్రకాష్ కు మారతాయని నోటీసుల్లో హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి నాలుగు వారాలలో స్పష్టత ఇవ్వాలని.. ఏబీసీఎల్ కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల జారీ చేసింది.. టీవీ9 ను రవి ప్రకాష్ 2004లో ప్రారంభించారు. సంచలన వార్తలతో తెలుగు మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. టీవీ9 ప్రారంభంలో డైరెక్టర్ గా.. ఆ తర్వాత సీఈవోగా రవి ప్రకాష్ వ్యవహరించారు.

Also Read : బీఆర్ఎస్ లీగల్ నోటీసులు ఇస్తే రవి ప్రకాష్ బెదిరిపోతాడా?

రవి ప్రకాష్ ది ముఖ్యపాత్ర

టీవీ9 ప్రారంభించి, దానిని అభివృద్ధి చేయడంలో రవి ప్రకాష్ ముఖ్యపాత్ర పోషించారు. 2009లో టీవీ9 లోగో కు సంబంధించి కాపీరైట్ ప్రొటెక్షన్ రిజిస్టర్ అయింది. దీనికి ఆథర్ గా రవి ప్రకాష్ ఉన్నారు. టీవీ9 ఛానల్ విస్తరించడంలో రవి ప్రకాష్ ముఖ్యపాత్ర పోషించారు. అందువల్ల ఆ లోగోను ఏబీసీఎల్ ఉపయోగించినందుకు రవి ప్రకాష్ కు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది.. ఏ బి సి ఎల్ మరో నాలుగు వారాల్లో ఢిల్లీ హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఏ ప్రకారం చూసుకున్నా టీవీ9 మాతృ సంస్థ ఏబీసీఎల్ రవి ప్రకాష్ కు అంత మొత్తంలో డబ్బులు చెల్లించక తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. మరోవైపు రవి ప్రకాష్ ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఒక ట్వీట్ చేశారు. దానిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ట్యాగ్ చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular