TTD: తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోవాలని భావించే వాళ్లకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపికబురు అందించింది. ప్రతిరోజూ ఏపీఎస్ ఆర్టీఎస్ బస్సులో తిరుమల దైవదర్శనానికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆర్టీసీ బస్సులలో తిరుమలకు ప్రయాణం చేసే భక్తులకు ప్రయోజనం చేకూరే విధంగా అధికారులు ఈ అవకాశాన్ని కల్పించడం గమనార్హం.

ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు కండక్టర్ ద్వారా దైవ దర్శనానికి సంబంధించిన టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ప్రయాణికులు తిరుమలకు ఛార్జీలతో పాటు 300 రూపాయలు అదనంగా చెల్లించడం ద్వారా శీఘ్ర దర్శనం టికెట్లను సులభంగా పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆర్టీసీ సూపర్ వైజర్ల సహాయంతో భక్తులు శీఘ్ర దర్శనం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
తిరుమల బస్ స్టేషన్ కు వెళ్లిన తర్వాత సూపర్ వైజర్లను సంప్రదించి ఉదయం 11 గంటల సమమయంలో, సాయంత్రం 4 గంటల సమయంలో శ్రీఘ్ర దర్శనం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మన రాష్ట్రంలోని వేర్వేరు డిపోల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ తిరుపతికి 650 బస్సులు నడుపుతోంది. ఇతర రాష్ట్రాలలోని ప్రముఖ నగరాల నుంచి కూడా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
తిరుమలకు దైవ దర్శనం కోసం వెళ్లాలని భావించే భక్తులకు టీటీడీ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. కరోనా నిబంధనల వల్ల పరిమిత సంఖ్యలో దర్శనానికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉండనున్న నేపథ్యంలో అధికారుల నిర్ణయం ద్వారా భక్తులకు మేలు జరగనుంది.