Federal Bank: గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన వాళ్లకు ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఫెడరల్ బ్యాంక్ అదిరిపోయే తీపికబురు అందించింది. బ్యాంకులలో ఇంటర్న్ షిప్ చేసి వర్క్ ఎక్స్ పీరియన్స్ పొందాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఫెడరల్ బ్యాంక్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఫెడరల్ బ్యాంక్ ఇప్పటికే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుండటం గమనార్హం. ఎవరైతే ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారో వారికి మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి పీజీ డిప్లొమా లభిస్తుంది.

ఈ పీజీ డిప్లొమా కలిగి ఉన్నవాళ్లు సంవత్సరానికి 5.70 లక్షల రూపాయల వేతనాన్ని పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని ఆసక్తిని కలిగి ఉంటారో వాళ్లు అక్టోబర్ 23వ తేదీలోపు ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ ను నవంబర్ నెల 7వ తేదీన నిర్వహిస్తారు. ఫెడరల్ బ్యాంకుల శాఖలు, ఆఫీసులతో పాటు ఫిజికల్ మోడ్ ఆఫ్ లర్నింగ్ ద్వారా ఇంటర్న్ లు పూర్తిస్థాయిలో విషయాలను తెలుసుకోవచ్చు.
ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారో వాళ్లకు మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి బ్యాంకింగ్ లో పీజీ డిప్లొమా పొందే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఈ కోర్సును సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారో వాళ్లను ఫెడరల్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తీసుకుంటారు. పది, ఇంటర్, డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించిన వాళ్లు ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2021 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నాటికి 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, గోవా, హర్యానా, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
https://www.federalbank.co.in/federal-internship-program వెబ్ సైట్ ద్వారా ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.