TTD Online Tickets: కరోనా సమయంలోనూ తిరుమలకు ఏమాత్రం భక్తుల రద్దీ తగ్గకపోగా డిమాండ్ పెరుగుతోంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన టోకెన్లు కేవలం నలభై నిమిషాల్లోనే బుక్ అయిపోయాయి. దీంతో చాలామంది టికెట్ బుకింగ్ ట్రై చేస్తూ స్లాట్ ఫుల్ అని రావడంతో నిరాశ చెందుతున్నారు. అయితేరేపు సర్వదర్శనం రూపంలో టికెట్ బుకింగ్ కు మరో అవకాశం లభించనుంది.
ఈరోజు కేవలం ఆన్‌లైన్‌లో రూ.300లతో శ్రీవారి దర్శన టికెట్లను మాత్రమే టీటీడీ విడుదల చేసింది. రోజుకు 12వేల టికెట్ల చొప్పున అంటే మూడు లక్షల 36వేల టికెట్లను అందుబాటులో ఉంచింది. ఈ టికెట్లన్నీ కూడా కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే బుకింగ్ అయ్యాయి. శనివారం ఉదయం 9గంటలకు సర్వదర్శనం టిక్కెట్లను అధికారిక వెబ్ సైట్లో టీటీడీ విడుదల చేయనుంది.
ఇవన్నీ కూడా ఫ్రీ టికెట్లు కావడంతో రూ. 300ల టికెట్ల కంటే అతి త్వరగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆన్ లైన్లో బుక్ చేసినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా బుక్ చేసుకునే అవకాశం ఉండనుంది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ tirupatibalaji.ap.gov.in లో మాత్రం టికెట్లు బుక్ చేసుకోవాలి. నకిలీ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి లేదంటే మోసపోతారు.
ఒక ఫోన్ నెంబర్ పై ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ కావాల్సిన వారు.. ఇద్దరు వ్యక్తులు టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. 12ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఆన్ లైన్ టికెట్లను జారీ చేస్తారు. ఈ విషయాలు తెలుసుకుని బుక్ చేసుకుంటే.. త్వరగా ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
దర్శనం చేసుకునే వారంతా కూడా ఐడీ కార్డు నెంబర్లు, వయస్సు, ఇతరత్ర వివరాలన్నీ దగ్గర పెట్టుకొని బుక్ చేసుకోవాలి. కేవలం నిమిషాల వ్యవధిలోనే టికెట్లు పూర్తయ్యే అవకాశం ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే టికెట్లు పొందే అవకాశం దక్కనుంది. ఇక కరోనా ఆంక్షలతో టీటీడీ పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిని ఇస్తోంది.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే. కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా దర్శనం చేసుకునే సమయంలోనే 78 గంటల ముందు చేసుకున్న కోవిడ్ టెస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా భక్తులు అధికారులకు చూపించాలి. వీరికి మాత్రమే అలిపిరి చెక్ పాయింట్ నుంచి తిరుమలకు అనుమతి లభించనుంది.