శ్రీవారి భక్తులకు శుభవార్త..!

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్న భక్తులకు ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మార్చి 23 నుంచి లాక్ డౌన్ తిరుమలలో స్వామివారి దర్శనం నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ 5వ విడతలో దేవాలయాల్లో కొన్ని నిబంధనలు పాటిస్తూ దేవాలయాలను జూన్ 8 నుంచి తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. […]

Written By: Neelambaram, Updated On : June 2, 2020 5:12 pm
Follow us on

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్న భక్తులకు ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మార్చి 23 నుంచి లాక్ డౌన్ తిరుమలలో స్వామివారి దర్శనం నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ 5వ విడతలో దేవాలయాల్లో కొన్ని నిబంధనలు పాటిస్తూ దేవాలయాలను జూన్ 8 నుంచి తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడంపై టీటీడీ జెఈవో ధర్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన ప్రభుత్వం కొన్ని నిబంధనలు పాటిస్తూ దర్శనానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని ఆదేశించింది. ఇప్పటికే భక్తుల మధ్య క్యూ లైన్లలో సామాజిక దూరం పాటిస్తూ మార్కింగ్, ఒక్కక్కరే వెళ్ళేవిధంగా క్యూ లైన్ ల వెడల్పు తగ్గించడం వంటి చర్యలు తీసుకున్నారు.