కేసీఆర్, మంత్రులకు జగ్గారెడ్డి సవాల్

టీఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే సింగూరు, మంజీరా రిజర్వాయర్లలో నీళ్లు నింపి చూపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం కాంగ్రెస్ నేతలు పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు వెళుతుండగా వారిని పోలీసులచే అరెస్టు చేయించడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయంలో ఏనాడూ కూడా చట్టాలను రాజకీయాల కోసం ఉపయోగించలేదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పోలీసులను రాజకీయాలకు ఉపయోగించుకుంటూ నీచానికి పాల్పడుతుందని విమర్శించారు. […]

Written By: Neelambaram, Updated On : June 2, 2020 5:11 pm
Follow us on

టీఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే సింగూరు, మంజీరా రిజర్వాయర్లలో నీళ్లు నింపి చూపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం కాంగ్రెస్ నేతలు పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు వెళుతుండగా వారిని పోలీసులచే అరెస్టు చేయించడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయంలో ఏనాడూ కూడా చట్టాలను రాజకీయాల కోసం ఉపయోగించలేదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పోలీసులను రాజకీయాలకు ఉపయోగించుకుంటూ నీచానికి పాల్పడుతుందని విమర్శించారు.

కేసీఆర్ చెబుతున్నట్లుగా సాగునీరు పంటల పొలాలకు రావడం లేదన్నారు. కేవలం గ్రాఫిక్స్ లో మాత్రమే నీళ్లు కన్పిస్తున్నాయని.. వాస్తవానికి పొలాలకు రావడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 90శాతం పూర్తయిన ప్రాజెక్టులను పక్కనపెట్టడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు పేరొస్తుందనే అక్కసును వాటిని పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. కృష్ణా నదిపై నిర్మించిన ఏడు ప్రాజెక్టులను పూర్తి చేస్తే పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తక్షణమే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ రైతులందరికీ సినిమా చూపిస్తున్నారన్నారు. గ్రాఫిక్స్ లోనే నీళ్లు కన్పిస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. దమ్ముంటే తెలంగాణ మంత్రులు మంజీరా, సింగూరు ప్రాజెక్టులను నీటితో నింపి చూపించాలన్నారు. కేసీఆర్ ముందు తెలంగాణ మంత్రులంతా గంపకింద కోడిపిల్లలేనంటూ ఎద్దేవా చేశారు. ఇక అసెంబ్లీలో ప్రతిపక్షాలను గొంతునొక్కేస్తున్నారని ఆరోపించారు. మీడియా స్వేచ్ఛను కూడా హరిస్తున్నారని విమర్శించారు. జగ్గారెడ్డి విసిరిన సవాల్ కు తెలంగాణ మంత్రులు ఏమేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!