తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దింతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమికి రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో మూడు రోజుల పాటు రాష్ర్టంలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలుచోట్ల సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరిగింది. మరికొన్ని రోజులు భానుడి ప్రతాపం తప్పదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.