క్లైమాక్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఆర్జీవీ

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘క్లైమాక్స్’. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సస్పెన్స్ థిల్లర్ గా ‘క్లైమాక్స్’ ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల చేయగా కేవలం రెండ్రోజుల్లో మినియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని వర్మ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అలాగే మియా మాల్కోవాపై షూట్ చేసిన ‘జస్ట్ డూ ఇట్.. ఫ్రీక్ అవుట్’ అనే మ్యూజికల్ వీడియోను […]

Written By: Neelambaram, Updated On : May 18, 2020 1:23 pm
Follow us on


సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘క్లైమాక్స్’. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సస్పెన్స్ థిల్లర్ గా ‘క్లైమాక్స్’ ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల చేయగా కేవలం రెండ్రోజుల్లో మినియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని వర్మ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అలాగే మియా మాల్కోవాపై షూట్ చేసిన ‘జస్ట్ డూ ఇట్.. ఫ్రీక్ అవుట్’ అనే మ్యూజికల్ వీడియోను శనివారం విడుదల చేసి ఆకట్టుకున్నాడు. కాగా నేడు క్లైమాక్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. వర్మ సోషల్ మీడియాలో విడుదల చేసిన కొద్దిసేపటికే ఈ ట్రైలర్ ట్రెండింగ్లోకి దూసుకెళ్లడం గమనార్హం.

క్లైమాక్స్ టీజర్కు కొనసాగింపుగా నేడు విడుదలైన ట్రైలర్ వర్మ అభిమానులను ఆకట్టుకుంటోంది. సస్పెన్స్, గ్లామర్ థిల్లర్ గా క్లైమాక్స్ మూవీని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. మియా మాల్కోవా తన ప్రియుడితో కలిసి నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశిస్తుంది. వారిని ఓ ముసుగు వేసుకున్న బృందం వెంటాడుతోంది. మియా మాల్కోవా ప్రియుడిని దుండగులు హతమారుస్తారు.. వారిని మియా మాల్కోవా ఎలా ఎదుర్కొంటునేదని సస్పెన్స్ ను తలపిస్తోంది. ఇక ఎడారిలో మియా మాల్కోవా అందాల ప్రదర్శన యువతను కిక్కించేలా ఉన్నాయి. మొత్తానికి క్లైమాక్స్ టీజర్ వర్మ అభిమానులకు కనువిందు చేస్తుందడనడంలో సందేహం లేదు. తాజగా ఈ మూవీని వర్మ మే 29న ఉదయం 11గంటలకు వర్మ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ యాప్ లో విడుదల చేయనున్నట్లు వర్మ ట్వీట్ చేశాడు.