TSPSC Paper Leak Case: పేపర్ లీకేజీ లో రెండు వికెట్లు డౌన్: రేణుక, ఆమె భర్త ఉద్యోగాల తొలగింపు

TSPSC Paper Leak Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.. ఇప్పటికే ఈ కేసు కు సంబంధించి సిట్ అధికారులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఫలితంగా ఈ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది.. ఇక ఈ కేసులో ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వనపర్తి జిల్లా గోపాల్పేట […]

Written By: Bhaskar, Updated On : March 21, 2023 9:01 am
Follow us on

TSPSC Paper Leak Case

TSPSC Paper Leak Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.. ఇప్పటికే ఈ కేసు కు సంబంధించి సిట్ అధికారులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఫలితంగా ఈ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది.. ఇక ఈ కేసులో ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా పనిచేస్తున్న రేణుకను సస్పెండ్ చేస్తూ ఎస్సి గురుకుల సొసైటీ సెక్రటరీ రోనాల్డ్ రాస్ స్కూల్ ప్రిన్సిపాల్ కు నివేదిక పంపారు. దీంతో ఆమె రేణుకను సస్పెండ్ చేశారు.. ఇక ఆమె భర్త డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపీడీవో ఆఫీసులో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు.. అధికారులు అతడిని విధులనుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.

ఈ కేసులో రాజశేఖర్, ప్రవీణ్, రేణుక శ్రీలత నిందితులు.. వీరిని విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజశేఖర్ ఈ కేసులో ప్రధాన సూత్రధారి. అతను కంప్యూటర్ల పాస్వర్డ్ లు తెలుసుకుని అందులో ప్రశ్న పత్రాలను కాపీ చేసి ప్రవీణ్ కు ఇచ్చేవాడు. వాటిని ప్రవీణ్ తీసుకొని రేణుకకు ఇచ్చేవాడు. నా దగ్గర పేపర్లు ఉన్నాయని, అభ్యర్థులను ఆకర్షించి డీల్ మాట్లాడాలని సూచించేవాడు. ఇలా వీరి దందా సాగింది.

సిట్ అధికారుల కస్టడీలో ఉన్న నిందితుల నుంచి అధికారులు కీలక సమాచారం సేకరిస్తున్నారు.. రాజశేఖర్ రెడ్డి గ్రూప్ _1 ప్రిలిమినరీ ప్రశ్న పత్రాలను తస్కరించేందుకు మూడు నెలల ముందు నాలుగు సార్లు విఫల యత్నం చేశాడు. అయితే ఐదో సారి ప్రశ్న పత్రాలను పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకున్నట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇక రాజశేఖర్, ప్రవీణ్ ప్రశ్న పత్రాలను ఎవరెవరికి అమ్ముకున్నారు? ఎంతకు అమ్ముకున్నారు? ఆ డబ్బులతో ఏం చేశారు అనేదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

TSPSC Paper Leak Case

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజశేఖర్‌, ప్రవీణ్‌లకు కమిషన్‌లో ఉన్న కంప్యూటర్ల ఐపీ అడ్రస్‌, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఎలా తెలిశాయి, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోని శంకరలక్ష్మి కంప్యూటర్‌ ఐపీ అడ్ర్‌సను ఎలా మార్చగలిగారు, అందులో ఉన్న సమాచారాన్ని పెన్‌ డ్రైవ్‌లోకి ఎలా పంపారు, శంకరలక్ష్మికి అనుమానం రాకుండా కంప్యూటర్‌ను ఎలా కంట్రోల్‌ చేయగలిగారనే సాంకేతిక అంశాలపై అధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. పేపర్‌ లీకేజీలో ఇతరుల ప్రమేయానికి సంబంధించి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి అనుమానం రాకుండా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఎలా తీసుకోగలిగారు. వాటి సాయంతో ఎన్ని ప్రశ్నపత్రాలు తీసుకున్నారు, ఎవరెవరికి ఇచ్చారనే కోణంలో కూడా అధికారులు విచారణ సాగిస్తున్నట్టు వినికిడి. ప్రవీణ్‌, రాజశేఖర్‌తో పాటు ఇతర నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్‌ అధికారులు, వారి కాల్‌డాటాపై దృష్టి పెట్టారు. ఆ ఫోన్ల లో ఉన్న కాంటాక్టుల గురించి కూపీ లాగే పనిలో ఉన్నారు.