
రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదం తారాస్థాయికి చేరుతోంది. టీఆర్ఎస్, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే వైసీపీ కంటే టీఆర్ఎస్ మంత్రులు ఘాటుగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వీరిలో మంత్రి శ్రీనివాస గౌడ్ ఒకడుగు ముందుకేసి పరుష పదాలు వాడడం మొదలుపెట్టారు. ‘మీ సంగతి చూస్తాం..’ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొడాలి నాని ని ఉద్దేశించి అని అన్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం చాలా సాఫ్ట్ గా రిప్లై ఇస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ ఇటీవల ఏపీ మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘మాటలు జాగ్రత్తగా రానీయ్యి.. లేకుండా ఆగమైపోతారు.. మీ ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయన్న విషయం మరిచిపోవద్దు..’ అని హెచ్చరించారు. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు రిప్లై ఇస్తున్నారు. కానీ వారంతా ఘాటుగా విమర్శలు చేయడం లేదు. సున్నితంగా పద్దతిగా మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ మంత్రులు మాత్రం అలా కాకుండా ఘాటుగా విమర్శిస్తున్నారు.
అయితే ఏపీకి చెందిన చాలా మంది మంత్రుల ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. కొందరికి వ్యాపారాలు కూడా ఉన్నాయి. కొడాలి నాని ఐదేళ్లలో నాలుగేళ్లు హైదరాబాద్లోనే ఉంటాడని టాక్. ఇక ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక మూలాలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. అందుకే తెలంగాణ మంత్రులు ఎంత రెచ్చిపోతున్నా ఏపీ నాయకులు మాత్రం ఏదో చెప్పాం లే.. అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదంతా హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమేనేనా..? అని తెలంగాణలో తీవ్రంగా చర్చ సాగుతోంది. ఇక్కడ గెలిచేందుకు తెలంగాణ సెంటిమెంట్ ను పైకి తెచ్చారని కొందరు అంటున్నారు. మరి ఈ వ్యూహం అక్కడ ఫలిస్తుందో..? లేదో..? చూడాలి..