
దేశంలోని చాలామంది ప్రజలు సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. అయితే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల సొంతిల్లు కట్టుకోవాలనే కల చాలామందికి తీరని కలే అవుతోంది. భారమవుతున్న ధరల వల్ల చాలామంది చివరి నిమిషంలో గృహ నిర్మాణం విషయంలో వెనక్కు తగ్గుతున్నారు. అధికారుల నుంచి అనుమతులు వచ్చినప్పటికీ 40 శాతానికి పైగా పనులు ఇప్పటికీ ప్రారంభించలేదు.
భవన నిర్మాణ సామాగ్రి ఖర్చు పెరగడం వల్ల 100 నుంచి 300 గజాల విస్తీర్ణంలో నిర్మాణం కోసం తీసుకున్న ప్లాన్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇంటికోసం స్థలం కొనుగోలు చేసిన వాళ్లు సైతం సిమెంట్, కూలి రేట్లు, ఇసుక, కంకర, ఇనుము ధరలు పెరగడంతో తమ దగ్గరున్న డబ్బుతో నిర్మాణం పూర్తి చేయడం సాధ్యమని చాలామంది భావిస్తున్నారు. అంచనాల కంటే 30 శాతం అదనపు ఖర్చు అవుతుందని భావించి నిర్మాణాలను చాలామంది తాత్కాలికంగా ఆపేశారు.
గృహ నిర్మాణ వ్యయం పెరగడం వల్ల గృహ నిర్మాణ అంచనా వ్యయం తలకిందులవుతూ ఉండటం గమనార్హం. 100 గజాల్లో ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం ఖర్చు 10 లక్షల రూపాయలు దాటుతోంది. కిటికీలు, టైల్స్, రంగులు, ఖరీదైన ఎలక్ట్రికల్ వస్తువులను వినియోగిస్తే అదనంగా 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలుస్తోంది. ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదని మధ్య తరగతి కుటుంబాలు ఇంటి నిర్మాణానికి పూనుకోవడం సాహసమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ధరలు పెరగడం వల్ల కూలీలకు పని దొరకడం లేదని కరోనా వల్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయని కూలీలు చెబుతున్నారు. పనులు మొదలుపెట్టినా బడ్జెట్ పెరిగిపోతుందని మధ్యలోనే ఆపేస్తున్నారని కూలీలు వెల్లడిస్తున్నారు. ధరల నియంత్రణ ద్వారా మాత్రమే నిర్మాణ రంగం కష్టాల నుంచి బయటపడగలదని భవన నిర్మాణ గుత్తేదారులు చెబుతున్నారు.