TS Inter Results 2022: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 28న ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు మూడు వెబ్ సైట్లలో తమ ఫలితాలు చూసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేశారు. మొదట జూన్ 15నే వస్తాయని తెలిసినా మళ్లీ జూన్ 25కు మార్చారు. కానీ ఫలితాల విడుదలకు సమయం కుదరకపోవడంతో ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఉండేందుకు మళ్లీ 28కి మార్చారు. ఎట్టకేలకు ఫలితాలు విడుదల చేయడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులు మూడు వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చని సూచించింది. ప్రభుత్వ వెబ్ సైట్లను ఓపెన్ చేసుకుని తమ ఫలితాలు చూసుకోవాలని ఆదేశించింది. https://tsbie.cgg.gov.in, https://results.cgg.in, https://examsresults.ts.nic.in వెబ్ సైట్లలో తమ హాల్ టికెట్ నెంబర్ టైపు చేసి తమ ఫలితాలు చూసుకోవాలని సూచించింది. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు వెబ్ సైట్లలో తమ రిజల్ట్స్ చూసుకుని ఏవైనా సందేహాలు ఉంటే ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేసుకోవచ్చు.
వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. తరువాత ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. దీంతో పీడీఎఫ్ ఫార్మాట్ లో సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. దీంతో విద్యార్థులు తమ ఫలితాలు తెలుసుకుని తరువాత చదివే కోర్సుల కోసం సమాయత్తం అవుతుంటారు. ఫలితాల ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తమ మార్కులు తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తరువాత వారు చేయబోయే కోర్సుల కోసం అన్వేషణ ప్రారంభిస్తున్నారు.

4.64 లక్షల మంది విద్యార్థులు మొదటి సంవత్సరం, 4.39 లక్షల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. కరోనా ప్రభావంతో 70 శాతం సిలబస్ తోనే విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగింది. పదిహేను రోజుల్లో అడ్వాన్స్ డ్ సప్లమెంటరీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ తదితర వాటికి కూడా సమయం కేటాయించనుంది. దీంతో విద్యార్థులు గమనించాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఎట్టకేలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన అధికారులు ఎలాంటి గొడవలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:KCR VS Tamilisai: గవర్నర్ తో కేసీఆర్ సమరమా? సంధినా? ఈరోజు తేలబోతోంది