Samantha Career In Danger: సౌత్ ఇండియా లో సుమారు దశాబ్ద కాలం నుండి అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ సమంత..ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చిన ఈమె డిమాండ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు అనే చెప్పాలి..ముఖ్యంగా నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత అయితే ఈమె వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ ఫుల్ బిజీ గా మారిపోయింది..ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాదు..బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా సమంత మంచి డిమాండ్ ని సొంతం చేసుకుంది..ప్రస్తుతం ఆమె యశోద, శాకుంతలం మరియు విజయ్ దేవరకొండ తో ఖుషి అనే సినిమాలో నటిస్తుంది..వీటితో పాటుగా ఇటీవలే ఆమె హిందీ లో ఒక్క లెస్బియన్ రోల్ చెయ్యడానికి కూడా సిద్ధం అయిపోయింది..ఇలా కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటిస్తూ తనకంటూ ఒక్క ప్రత్యేకతని చాటుకుంటూ ముందుకి దూసుకుపోతుంది సమంత..ఇది కాసేపు పక్కన పెడితే సమంత వ్యవహరిస్తున్న తీరుపై ఆమెతో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తునట్టు సమాచారం.

Also Read: KCR VS Tamilisai: గవర్నర్ తో కేసీఆర్ సమరమా? సంధినా? ఈరోజు తేలబోతోంది
సోషల్ మీడియా అన్న తర్వాత కచ్చితంగా ఒక సెలబ్రిటీ కి అభిమానులు ఎంత మంది ఉంటారో..దురాభిమానులు కూడా అంతే ఉంటారు..సెలెబ్రిటీలు రెండిటికి అతీతంగా వ్యవహరిస్తూ ముందుకి పోవాలి..సాధారణంగా ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇలాగె ఉంటారు..కానీ సమంత మాత్రం నెగటివిటీ ని బాగా మనసుకి తీసుకుంటుంది..తన పై వచ్చే ట్రోల్ల్స్ కి ఆమె సమాధానం చెప్తూ ఎక్కడలేని నెగటివిటీ ని మూటగట్టుకుంటుంది..పైగా నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత పై సోషల్ మీడియా నెగటివిటీ విపరీతంగా పెరిగిపోయింది..ఈ నెగటివిటీ తమ సినిమాల పై ఎక్కడ పడుతుందో అని ఆమె నిర్మాతలు భయపడిపోతున్నారు..ముఖ్యంగా శాకుంతలం మరియు యశోద సినిమాలకు వందల కోట్లు ఖర్చుపెట్టి భారీ బడ్జెట్ తో తీశారు..రెండు సినిమాలు కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే అవ్వడం విశేషం..ఇలా రోజురోజుకి నెగటివిటీ పెంచుకుంటూ పోతే రేపు నీ సినిమాలకి బజ్ పేల్చపడిపోతుంది అని..దయచేసి నెగటివ్ కామెంట్స్ కి సోషల్ మీడియా లో రియాక్ట్ అవ్వొద్దు అంటూ సమంత కి నిర్మాతలు బ్రెయిన్ వాష్ చేసినట్టు సమాచారం..మరి వారి మాటలను సమంత లెక్క చేస్తుందా లేదా అనేది చూడాలి.

Also Read: AP Free Ration: బీజేపీ నేతలకు ఏమైంది.. ఉచిత బియ్యం పంపిణీ నిలిచినా నోరు మెదపరేమీ?

[…] Also Read: Samantha Career In Danger: ప్రమాదం లో పడిన సమంత కెరీర్… […]
[…] Also Read: Samantha Career In Danger: ప్రమాదం లో పడిన సమంత కెరీర్… […]