https://oktelugu.com/

Prashanth Neel waiting For Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం పడిగాపులు కాస్తున్న KGF దర్శకుడు ప్రశాంత్ నీల్

Prashanth Neel waiting For Pawan Kalyan: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద KGF సిరీస్ సృష్టించిన ప్రభంజనం గురించి ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు..ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన KGF చాప్టర్ 1 చిత్రం అన్ని ప్రాంతీయ బాషలలో అప్పట్లో భారీ విజయం సాధించి 250 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..కనీసం వంద కోట్ల మార్కెట్ కూడా లేని కన్నడ చిత్ర పరిశ్రమ కి అప్పట్లో గర్వ పడేలా చేసింది ఈ చిత్రం..చాప్టర్ 1 […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 28, 2022 / 11:55 AM IST

    Prashanth Neel, Pavan Kalyan

    Follow us on

    Prashanth Neel waiting For Pawan Kalyan: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద KGF సిరీస్ సృష్టించిన ప్రభంజనం గురించి ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు..ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన KGF చాప్టర్ 1 చిత్రం అన్ని ప్రాంతీయ బాషలలో అప్పట్లో భారీ విజయం సాధించి 250 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..కనీసం వంద కోట్ల మార్కెట్ కూడా లేని కన్నడ చిత్ర పరిశ్రమ కి అప్పట్లో గర్వ పడేలా చేసింది ఈ చిత్రం..చాప్టర్ 1 భారీ హిట్ అవ్వడం తో చాప్టర్ 2 పై ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది..భారీ అంచనాల నడుమ ఈ ఏడాది విడుదలైన KGF చాప్టర్ 2 సినిమా కూడా సంచలన విజయం సాధించింది..ఈ చిత్రం అయితే ఏకంగా 1200 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి ఆల్ టైం టాప్ 2 ఇండియన్ గ్రాస్ మూవీ గా నిలిచింది..దీనితో ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది..టాలీవుడ్ , కోలీవుడ్ మరియు బాలీవుడ్ అని తేడా లేకుండా పతి ఒక్క హీరో ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చెయ్యడానికి తహతహలాడుతున్నారు.

    Prasanth Neel

    కానీ ప్రశాంత్ నీల్ కి మాత్రం టాలీవుడ్ లో ఒక్క హీరో తో పని చెయ్యాలనే కోరిక ఉందట..ఆ హీరో మరెవరో కాదు..మన పవర్ స్టార్ పవన్ కల్యాణే..పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న హీరో తో సరైన సినిమా తీస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ ఎలా షేక్ అవుతాయో మన అందరికి తెలిసిందే..దర్శక ధీరుడు రాజమౌళి కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడానికి చాలా ప్రయత్నాలే చేసాడు..అందరూ హీరోలు రాజమౌళి తో చెయ్యడానికి ఎదురు చూస్తుంటే రాజమౌళి మాత్రం నాకు పవన్ కళ్యాణ్ తో చెయ్యాలనే కోరిక ఉంది అంటూ పలు సందర్భాలలో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు..గత కొంతకాలం క్రితం ఈ విషయం పై KGF నిర్మాతలు హోమబుల్ సంస్థ వారు పవన్ కళ్యాణ్ తో చర్చలు కూడా జరిపారు..కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న బిజీ కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదు..పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తానూ ఒప్పుకున్నా సినిమాలను పూర్తి చెయ్యడానికే సరైన సమయం దొరకట్లేదు..ప్రస్తుతం ఆయన క్రిష్ తో హరిహర వీర మల్లు, హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్..మరియు తమిళం లో సూపర్ హిట్టైన వినోదయ్యా సీతం రీమేక్ వంటి సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు.

    Prashanth Neel, Pavan Kalyan

    Also Read: YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు: కోర్టులో ఆయన కూతురు సంచలన వాదనలు

    ఇవి పూర్తి అయ్యేలోపే చాలా సమయం పడుతుంది..మరి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది ఇప్పట్లో చెప్పలేము అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఈ ప్రాజెక్ట్ ఒక్కవేల సెట్ అయితే 2024 వ సంవత్సరం తర్వాతే సెట్ అవుతుంది..ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు..ఈ సినిమా పూర్తి అవ్వగానే ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడు..మరోపక్క KGF చాప్టర్ 3 కూడా ఉంటుంది అని ఆ చిత్ర నిర్మాత ఇది వరకే ప్రకటించాడు..పవన్ కళ్యాణ్ తో సినిమా ఖరారు అయితే KGF చాప్టర్ 3 ప్రారంభం అవ్వడానికి చాలా సమయం పడుతుంది..ఒక్కవేల పవన్ కళ్యాణ్ తో సినిమా లేకపోతే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఒప్పుకున్నా రెండు సినిమాల తర్వాత KGF3 ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తుందో లేదో చూడాలి.

    Also Read: Two Heroines Fell In Love With NTR: అప్పట్లో ఎన్టీఆర్ తో ప్రేమాయణం నడిపిన ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా..?

    Tags