TS Inter 1st Year Result 2021: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చేసింది. గురువారం మధ్యాహ్నం ఇంటర్ బోర్డు ఆఫీసర్లు ఫలితాలను విడుదల చేశారు. గత మార్చి నెలలో నిర్వహించాల్సిన ఎగ్జామ్స్‌ను నిర్వహించాల్సిన ఎగ్జామ్స్‌ను అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు నిర్వహించారు ఇంటర్ బోర్డు అధికారులు. కాగా ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌ను 4.3 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఇక ఫలితా్లో అమ్మాయిలే మరోసారి టాప్‌లో నిలిచారు.

అమ్మాయిలు 56శాతం మంది ఉత్తీర్ణత సాధిస్తే అబ్బాయిలు 42శాతం పాస్ అయ్యారు. ఇక మొత్తం మీద 49 శాతం మంది స్టూడెంట్లు పాస్ అయ్యారు. కాగా సగం కంటే ఎక్కువ మంది ఫెయిల్ కావడం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది. ఇక ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in లింక్‌ను క్లిక్ చేయాలని సూచించారు అధికారులు. ఒకవేళ ఈ వెబ్ సైట్ ప్రాబ్లమ్ వస్తే examresults.ts.nic.in లింక్‌ను ఓపెన్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.
ఇక 4,59,242 మంది స్టూడెంట్లు ఎగ్జామ్ రాసినట్టు బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఇందులో 2,24,012 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇందులో A గ్రేడ్‌లో 11,5538మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అలాగే B గ్రేడ్‌లో 66,351మంది ఇక C గ్రేడ్‌లో 27,752 మంది స్టూడెంట్లు పాస్ అయినట్టు తెలిపింది ఇంటర్ బోర్డు. వీరు తమ మార్కుల స్కోర్ బోర్డును సదరు వెబ్ సైట్‌లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని బోర్డు అధికారులు వెల్లడించారు.
Also Read: TRS: గులాబీ అధినేతకు గుబులు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా.. !
అయితే కరోనా కారణంగా సెకండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లను సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ చేసిన గవర్నమెంట్.. మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించడంపై చాలామంది స్టూడెంట్లు, తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. అటు సెకండ్ ఇయర్ సెలబస్ పై ఫోకస్ పెట్టడం వల్లే ఇంతమంది ఫెయిల్ అయినట్టు వాపోతున్నారు. కాగా దీనిపై ఇంటర్ బోర్డు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక బుధవారమే రిజల్ట్ వస్తాయనుకుంటే.. ఒకరోజు ఆలస్యంగా వచ్చాయి.
Also Read: KCR Rythu Bandhu: రైతుబంధు తమ ఘనతగా చెప్పుకుంటున్న కేసీఆర్.. లాభం మాత్రం ఎవరికి?