టెన్త్ కుదింపు: తెలంగాణలో స్కూళ్లు తెరిచేది అప్పుడే..

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడికక్కడ స్కూల్స్‌ మూతపడ్డాయి. ఈ మధ్య ఆన్‌లైన్‌ క్లాసెస్‌ ప్రారంభించినా విద్యార్థులకు పెద్దగా అర్థం కాని పరిస్థితే ఉంది. కరోనా కూడా తగ్గుముఖం పట్టడంతో స్కూల్స్‌ తెరిచేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమైంది. ఈ క్రమంలోనే 2020–-21 విద్యాసంవత్సరానికి గాను జరిగే ఎస్ఎస్‌సీ పరీక్షల్లో పేపర్ కౌంట్‌ను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. Also Read: రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కేసీఆర్ సమాలోచన.. సుప్రీంకు వెళుతారా? ప్రస్తుతం విద్యార్థులు 11 పేపర్లు రాయాల్సి ఉండగా.. […]

Written By: Srinivas, Updated On : December 18, 2020 2:06 pm
Follow us on


కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడికక్కడ స్కూల్స్‌ మూతపడ్డాయి. ఈ మధ్య ఆన్‌లైన్‌ క్లాసెస్‌ ప్రారంభించినా విద్యార్థులకు పెద్దగా అర్థం కాని పరిస్థితే ఉంది. కరోనా కూడా తగ్గుముఖం పట్టడంతో స్కూల్స్‌ తెరిచేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమైంది. ఈ క్రమంలోనే 2020–-21 విద్యాసంవత్సరానికి గాను జరిగే ఎస్ఎస్‌సీ పరీక్షల్లో పేపర్ కౌంట్‌ను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Also Read: రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కేసీఆర్ సమాలోచన.. సుప్రీంకు వెళుతారా?

ప్రస్తుతం విద్యార్థులు 11 పేపర్లు రాయాల్సి ఉండగా.. దాన్ని 6 పేపర్లకు తగ్గించాలని భావిస్తోంది. అయితే.. దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఇవే అంశాలతో విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. వచ్చే నెల నుంచి విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. జనవరి మొదటి వారంలో కానీ సంక్రాంతి తర్వాత కానీ స్కూళ్లను తెరిచే యోచనలో ప్రభుత్వం ఉంది.

స్కూళ్లతోపాటు ఇతర విద్యాసంస్థలను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచనకు వచ్చింది. అయితే ముందుగా 9వ తరగతి నుంచి విద్యార్థులు క్లాసులకు హాజరవుతారని ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది. ఇక 2021లో 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతారని విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు ఇదివరకటిలా కాకుండా 6 పేపర్లు మాత్రమే రాసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.

Also Read: టీపీసీసీ ఎంపికపై తడబడుతున్న అధిష్టానం..! కారణమెంటీ?

అయితే పరీక్ష సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదనే సంకేతాలు ఇచ్చింది. ఇక రెండు పరీక్షలకు మధ్య ఒకరోజు గ్యాప్ ఇవ్వడం జరుగుతుందని, మ్యాథ్స్ లాంటి కష్టమైన సబ్జెక్టులకు ప్రిపేర్ అయ్యేందుకు రెండు రోజుల సమయం ఇవ్వనున్నట్లు సమాచారం. పరీక్ష పేపర్లను తగ్గించడమంటే సిలబస్‌లో కోత విధిస్తున్నట్లే అని, అదే సమయంలో ప్రశ్నల సంఖ్య, ఛాయిస్‌లను కూడా తగ్గించడం జరుగుతుందని తెలంగాణ విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్