https://oktelugu.com/

అసలు రంగు బయటపెట్టిన పవన్ భార్య

పవన్ మూడో భార్య అన్నా లెజెనేవా లేటెస్ట్ లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఎయిర్ పోర్ట్ లో అన్నా లెజెనేవాను చూసిన చాలా మంది ఆమెను గుర్తుపట్టలేదు. దానికి కారణం పూర్తిగా భిన్నమైన లుక్ లో ఆమె దర్శనం ఇవ్వడం జరిగింది. చీర కట్టు, నుదుట బొట్టుతో సాంప్రదాయ గృహిణిగా అందరికీ తెలిసిన అన్నా, తన ఒరిజినల్ లుక్ ని బయటపెట్టారు. 2012లో రేణూ దేశాయ్ కి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్… 2013లో రష్యాకు […]

Written By:
  • admin
  • , Updated On : December 18, 2020 / 02:35 PM IST
    Follow us on


    పవన్ మూడో భార్య అన్నా లెజెనేవా లేటెస్ట్ లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఎయిర్ పోర్ట్ లో అన్నా లెజెనేవాను చూసిన చాలా మంది ఆమెను గుర్తుపట్టలేదు. దానికి కారణం పూర్తిగా భిన్నమైన లుక్ లో ఆమె దర్శనం ఇవ్వడం జరిగింది. చీర కట్టు, నుదుట బొట్టుతో సాంప్రదాయ గృహిణిగా అందరికీ తెలిసిన అన్నా, తన ఒరిజినల్ లుక్ ని బయటపెట్టారు. 2012లో రేణూ దేశాయ్ కి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్… 2013లో రష్యాకు చెందిన అన్నా లెజినేవాను వివాహం చేసుకున్నారు. తీన్ మార్ సినిమాలో అన్నా ఒక హీరోయిన్ గా నటించారు. ఆ సమయంలో ఏర్పడిన వీరి పరిచయం పెళ్ళికి దారి తీసింది.

    పవన్ కళ్యాణ్- అన్న లెజినేవాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మాయి పేరు పొలెనా అంజనా పావనోవా కాగా, కొడుకుకు మార్క్ శంకర్ పావనోవా. విదేశీ యువతి అయినప్పటికీ పెళ్లి తరువాత అన్నా చాలా సాంప్రదాయ గృహిణిగా మారిపోయారు. నుదుటన బొట్టు, చీర కట్టుకొని ఆమె కనిపించేవారు. పవన్ తో ఆమె ఎప్పుడు కనిపించినా ఇదే లుక్ లో దర్శనం ఇచ్చేవారు. క్రిస్మస్ వేడుకల కోసం రష్యా వెళ్లిన అన్నా, అవి ముగించుకొని ఇండియాకి రావడం జరిగింది. పవన్ పక్కన లేకపోవడం వల్లనో ఏమో కానీ, మునుపటి తన లుక్ లోకి అన్నా మారిపోయారు.

    అన్నా లెజెనోవా టి షర్ట్, జీన్స్ లో ట్రెండీగా కనిపించారు. ఆమె హెయిర్ స్టైల్ కూడా భిన్నంగా ఉంది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అన్నా లుక్ చూస్తే ఒకింత అబ్బాయి అన్న భావన కలిగింది. ఇక రష్యాకు వెళ్లిన కారణంగానే అన్నా, నిహారిక వెడ్డింగ్ కి హాజరు కాలేదు. ఎన్ని పనులున్నా ప్రతి ఏడాది క్రిస్మస్ కి రష్యా వెళ్లే పవన్ కూడా నిహారిక పెళ్లి మరియు పాలిటిక్స్ వలన వెళ్లలేకపోయారు. ఇక పవన్ కొడుకు మార్క్ శంకర్ పవనోవా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్