ప్రస్తుత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ పదవీ కోసం కాంగ్రెస్ సీనియర్లు పోటీపడుతున్నారు. ఆ పదవీని దక్కించుకునే శాయశక్తులా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. నేతల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఎన్నడూ లేనివిధంగా పీసీసీ ఎంపికపై అభిప్రాయ సేకరణ చేపట్టింది.
Also Read: షాకింగ్: కరోనా వ్యాక్సిన్ కు జనాల్లో స్పందన కరువు
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ మూడురోజులు హైదరాబాద్లోనే మకాం వేసి అభిప్రాయ సేకరణ చేపట్టారు. కాంగ్రెస్ లోని అన్ని జిల్లాల అధ్యక్షులు.. ఇతర నేతల అభిప్రాయాలను సేకరించి అధిష్టానికి నివేదించారు. దీంతో త్వరలోనే టీపీసీసీ ప్రకటన వస్తుందని కాంగ్రెస్ నేతలు భావించారు.
అయితే పీసీసీపై ఆశలు పెట్టుకున్న నేతలందరికీ ఊహించని విధంగా అధిష్టానం షాకిచ్చింది. పీసీసీ రేసులో ఉన్న ప్రతీఒక్కరిని ఢిల్లీకి పిలిపించిన మాట్లాడిన అధిష్టానం టీపీసీసీ చీఫ్ ను మాత్రం ప్రకటించకుండా కొత్త సంవత్సరానికి వాయిదా వేసింది. అయితే టీపీసీసీ చీఫ్ ప్రకటన ముందు మరోసారి కాంగ్రెస్ లోని సీనియర్ తో మాట్లాడాలని అధిష్టానం భావిస్తుందని టాక్ విన్పిస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి ఠాగూర్ కూడా ఢిల్లీ నుంచి తమిళనాడు వెళ్లిపోయారు. ఆయన ఈనెల 22వరకు ఆయన తిరిగి ఢిల్లీకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో అప్పటి వరకు నేతలెవరూ కూడా ఢిల్లీకి రావద్దని అధిష్టానం సూచించింది. కాగా ఇప్పటికే పలువురు నేతలు సోనియాగాంధీ.. రాహుల్ తో భేటి అయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Also Read: తిరుపతి ఉప ఎన్నికకు ముందే కర్నూలుకు హైకోర్టు?
తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధిష్టానం మరోసారి సీనియర్లతో భేటి నిర్వహించి పీసీసీపై వారి అభ్యంతరాలను తెలుసుకోవాలని భావిస్తుంది. అయితే ఎవరినీ ఎప్పుడు ఢిల్లీకి పిలువాలన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు.
పీసీసీ చీఫ్ ఎంపిక పూర్తి చేసిన తర్వాతే కాంగ్రెస్ నేతలందనీ పిలిచి వారి ముందే ప్రకటన చేయాలని అధిష్టానం భావిస్తుందని సమాచారం. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల వలసలను ఆపేందుకే అధిష్టానం టీపీసీసీ చీఫ్ ప్రకటనను ఆలస్యం చేస్తుందా? అనే అనుమానాలను కాంగ్రెస్ నేతలే వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్