Jagan Shocks MLA Balakrishna: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పీఏలు గా వ్యవహరించే వారు సరిగా ఉండటం లేదు. దీంతో ఆయన వ్యవహారాలు వెనుకబడిపోతున్నాయి. ఆయనకు పీఏలుగా వచ్చిన సరిగా పనిచేయకపోవడంతో ఆయన పనులు ముందుకు సాగడం లేదు. ఇటీవల ఆయన పీఏగా నియమితులైన బాలాజీ పేకాట ఆడుతూ పట్టుబడటంతో ఆయన డిప్యూటేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై బాలకృష్ణ కూడా స్పందించలేదు.
ఈ నేపథ్యంలో పూర్వం బాలాజీ ఉపాధ్యాయుడిగానే ఉన్నందున ఆతడిని సొంత విధుల్లోకి పంపనున్నారు. ఇటీవల కర్ణాటక సరిహద్దులోని బార్ అండ్ రెస్టారెంట్ లో వైసీపీ నేతలతో పేకాట ఆడుతూ పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బాలాజీ డిప్యూటేషన్ రద్దు చేయడం సంచలనంగా మారింది. పోలీసులు అరెస్టు చేసి బాలాజీపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
Also Read: BJP- Janasena – TDP: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసేనా?
బాలకృష్ణ కోరిక మేరకే బాలాజీని పీఏగా నియమించారు. కానీ అతడు అసాంఘిక కార్యకలాపాలకు దగ్గర కావడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గంలో బాలకృష్ణ పనులు చక్కదిద్దుతారని అనుకుంటే అతడే చట్టవ్యతిరేకంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. నియోజకవర్గంలో అన్ని పనులు చక్కబెడుతూ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రవర్తించాల్సి ఉన్నా పీఏ పనులు సరిగా లేనందున అతడిని తొలగించినట్లు తెలుస్తోంది.
ఇదివరకు ఉన్న పీఏ కూడా సరిగా పనిచేయక వెళ్లిపోవడంతో బాలాజీని తీసుకున్నా అతడు కూడా తన విధులు సరిగా నిర్వహించకపోవడంతో అతడి డిప్యూటేషన్ రద్దు చేసి టీచర్ గానే పంపిస్తున్నారు. మొత్తానికి బాలకృష్ణకు పీఏలు సహకరించడం లేదు. ఫలితంగా ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఆయన అందుబాటులో ఉండలేకే పీఏను నియమించి పనులు చేసి పెట్టాలని చెబుతున్నా వారు తమ స్వప్రయోజనాల కోసమ పనిచేస్తుండటం విశేషం.
Also Read:Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో సఖ్యత నెలకొంటుందా?