https://oktelugu.com/

గ్రౌండ్ లెవల్లో జీరో.. సోషల్ మీడియాలో హీరో..

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇంకా పాలిటిక్స్ ను ఒంటబట్టించుకున్నట్లు కన్పించడం లేదు. బాబు సీఎం ఉన్నప్పుడే ఎమ్మెల్సీ కోటాలో పదవీ దక్కించుకొని మంత్రి అయ్యారు. బాబు హయాంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినా చినబాబు ఇంకా గ్రౌండ్ లెవల్ పాలిటిక్స్ అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారనే వాదనలు విన్పిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత చినబాబు కేవలం సోషల్ మీడియానే నమ్ముకోవడంపై టీడీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Also Read: ఉత్తరాంధ్ర […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 27, 2020 / 12:19 PM IST
    Follow us on


    ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇంకా పాలిటిక్స్ ను ఒంటబట్టించుకున్నట్లు కన్పించడం లేదు. బాబు సీఎం ఉన్నప్పుడే ఎమ్మెల్సీ కోటాలో పదవీ దక్కించుకొని మంత్రి అయ్యారు. బాబు హయాంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినా చినబాబు ఇంకా గ్రౌండ్ లెవల్ పాలిటిక్స్ అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారనే వాదనలు విన్పిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత చినబాబు కేవలం సోషల్ మీడియానే నమ్ముకోవడంపై టీడీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    Also Read: ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉపేక్షించను.. అవంతి

    2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. కేవలం 23సీట్లను దక్కించుకోగా వీరిలో ఇప్పటికే పలువురు సీఎం జగన్మోహన్ రెడ్డికి జై కొడుతున్నారు. అయితే తొలిసారి మంగళగిరి నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన నారాలోకేష్ ఓడిపోవడం ఆపార్టీని మరింత కుంగదీసింది. సీఎం కుమారుడిగా, మంత్రిగా పనిచేసిన లోకేష్ బాబు గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలవడంతో చిన్నబాబు స్టామినా పై ప్రశ్నలు తలేత్తాయి. కేవలం చంద్రబాబును చూసే లోకేష్ బాబును టీడీపీ శ్రేణులు భరిస్తున్నాయి తప్పా ఆయనకు పార్టీని నడిపే శక్తిలేదని సొంతపార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తున్నారు.

    పార్టీకి ఓటమికి కారణాలను విశ్లేషించుకొని క్షేత్రస్థాయిలోకి క్యాడర్ మళ్లీ పుంజుకోవాల్సిన చేయాల్సిన చంద్రబాబు, లోకేష్ బాబు ప్రస్తుతం సైలంటయ్యారు. చంద్రబాబు ఒకవైపు వయోభారం మోస్తూనే పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇక లోకేష్ బాబు కేవలం సోషల్ మీడియానే నముకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ట్వీటర్లో కొన్ని పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటున్నా అవన్నీ పార్టీ బలోపేతానికి ఏవిధంగా ఉపయోగపడుతాయనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రజల్లో ఉండి ప్రజా వ్యతిరేక పోరాటాలు చేయకుండా ఎంతకాలం సోషల్ మీడియాలో పోస్టులతో కాలం వెళ్లదీస్తారని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు.

    Also Read: ‘మద్యం’పై ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదం..!

    ఈ నేపథ్యంలోనే టీడీపీ పగ్గాలను త్వరలోనే లోకేష్ బాబు చేపడుతారని ప్రచారం జరుగుతోంది. ప్రజాక్షేత్రంలో కాకుండా సోషల్ మీడియానే నమ్ముకున్న చినబాబు పార్టీని ఏవిధంగా గాడిన పడుతారనే ప్రశ్న తలెత్తుతోంది. ఎవరో రాసిచ్చిన స్క్రీప్టులతో చినబాబు ఎంతకాలం రాజకీయాలను మేనేజ్ చేయగలుగుతారని అంటున్నారు. టీడీపీ నాయకుల అరెస్టులతో అప్పుడప్పుడు లోకేష్ బాబు హడావుడి కన్పిస్తుంది తప్ప ప్రజా పోరాటాల్లో లోకేష్ బాబు ఎక్కడా కన్పించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    దీంతో టీడీపీ శ్రేణులు చినబాబు నాయకత్వాన్ని ఎంతవరకు అంగీకరిస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే చినబాబు త్వరలోనే సైకిల్ యాత్ర చేపట్టి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే లోకేష్ బాబు రాజకీయాలు సోషల్ మీడియాకే పరిమితం అవుతాయా? లేదా ప్రజాక్షేత్రంలోనూ ఆయన సత్తా చాటుతారా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే..!