spot_img
Homeజాతీయ వార్తలుసాగర్ లో పై‘చేయి’ కోసం టీఆర్ఎస్ ప్రయత్నం

సాగర్ లో పై‘చేయి’ కోసం టీఆర్ఎస్ ప్రయత్నం

Nagarjuna Sagar By Polls

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచార గడువు దగ్గర పడుతోంది. సాగర సంగ్రామంలో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. తమ ఆలోచనలకు పదును పెడుతున్నాయి. కీలకమైన పోల్ మేనేజ్ మెంట్ పై అధికార టీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టింది. ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్ కు పట్టు ఉందని భావిస్తున్న ప్రాంతాల్లో పై చేయి సాధించే పనిలో పడింది. పోలింగ్ బూత్ ల వారీగా అవసరమైన సమాచారుం సేకరిస్తోంది. తమకు అనుకూల వాతావరణం సృష్టించుకునే పనిలో పడింది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు జోష్ మీద ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ .. సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉన్నప్పటికీ.. పోల్ మేనేజ్మెంట్ విజయవంతం చేస్తే.. గెలుపు తమదే అనే ధీమాను టీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలింగ్ వరకు చేపట్టాల్సిన ఎత్తుగడలపై అధికార పార్టీ దృష్టి పెట్టినట్లు సమాచారం. పలువురు నేతలోత ఒక బృందం ఏర్పాటు చేసుకుని పోల్ మేనేజ్మెంట్ అప్పటించినట్లు చర్చ జరుగుతోంది.

2014 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు 2018 అసెంబ్లీ, 2019 లోక్ సభ ఎన్నికల సమాచారం టీఆర్ఎస్ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బూత్ ల వారీగా కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు, టీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లపై సమాచారం విశ్లేషించారని తెలుస్తోంది. కాంగ్రెస్ కు కొంత పైచేయి ఉన్న పోలింగ్ బూత్ లపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. ఇటు కాంగ్రెస్ కు పైచేయి ఉందని అనుకుంటున్న మండలాలపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతోంది.

ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో మోహరించిన టీఆర్ఎస్ ప్రత్యర్థికి ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా వ్యూహాలకు పదును పెడుతోంది. మరోవైపు కేసీఆర్ సభతో ఎన్నికల వాతావరణాన్ని గులాబీ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ పక్కాగా అమలు చేయడంతో విజయం సాధించామని.. భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. అదే తరహా వ్యూహం నాగార్జున సాగర్ లోనూ అమలు చేస్తోంది. ఇలా చేస్తే.. విజయం తమదే అనే ధీమాను వ్యక్తం చేస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Oktelugu Epaper
Exit mobile version