TRS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై నిరసన గళం పెంచాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి సారి నియోజకవర్గాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. తరువాత ఇందిరాపార్కు వద్ద నిరసన తెలిపారు. ఇప్పుడు గల్లీల్లోనే కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో రాష్ర్టంలో బీజేపీని ఎదగనీయకుండా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీని ఆదిలోనే అడ్డుకోవాలని భావిస్తున్నారు.
దీనికోసమే బీజేపీని అన్ని మార్గాల్లో అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు ధాన్యం కొనుగోలును రద్దాంతం చేసినా అది ప్రయోజనం కలిగించలేదు. దీంతో మరోమారు బీజేపీని బదనాం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో పడిపోయారు. దీని కోసమే తమిళనాడు సీఎం స్టాలిన్ కలిసి కలిసి రావాలని కోరారు.
ఈనెల 20న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాలని పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ ప్రతిష్టను మసకబారేలా చేయాలని కుయుక్తులు పన్నుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా కూడా సింగరేణి గనుల ప్రైవేటీకరణను ఎండగట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
Also Read: D Srinivas: డీఎస్ ఎందుకు కాంగ్రెస్ లో చేరలేదు.. ఆ గ్యాప్ కు కారణమిదే?
కేంద్రంపై ప్రత్యక్ష పోరాటానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. గల్లీల్లో కూడా బీజేపీని ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటూ వారి స్థానాన్ని పదిలం చేసుకోవాలని చెబుతున్నారు.లేకపోతే రాబోయే ఎన్నికల్లో కష్టాలు వస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బీజేపీని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ పలు మార్గాల్లో ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Also Read: KCR: టార్గెట్ బీజేపీ.. రైతుబంధుపై కేసీఆర్ క్లారిటీ..