https://oktelugu.com/

Rakul preeth: పాత్ర డిమాండ్ చేసింది కదా అని.. ఆ తప్పు మాత్రం చేయను- రకుల్​

Rakul preeth: కెరటం సినమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​ సినిమాతో ప్రార్థనగా అందరి మనసులను దోచుకున్న హీరోయిన్​ రకుల్​ప్రీత్​ సింగ్​. అనంతరం వరుసగా సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ.. కెరీర్​లో ఫుల్​ జోష్​తో దూసుకెళ్లిపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు టాలీవుడ్​లో టాప్​ హీరోలతో జత కడుతూనే.. మరోవైపు బాలీవుడ్​లోనూ తన సత్తా చాటాలని అనుకుంటోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు, హిందీ చిత్రాల్లోనూ ఫుల్​ బిజీగా గడుపుతోంది రకుల్​. Also Read: సమంత […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 18, 2021 / 10:52 AM IST
    Follow us on

    Rakul preeth: కెరటం సినమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​ సినిమాతో ప్రార్థనగా అందరి మనసులను దోచుకున్న హీరోయిన్​ రకుల్​ప్రీత్​ సింగ్​. అనంతరం వరుసగా సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ.. కెరీర్​లో ఫుల్​ జోష్​తో దూసుకెళ్లిపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు టాలీవుడ్​లో టాప్​ హీరోలతో జత కడుతూనే.. మరోవైపు బాలీవుడ్​లోనూ తన సత్తా చాటాలని అనుకుంటోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు, హిందీ చిత్రాల్లోనూ ఫుల్​ బిజీగా గడుపుతోంది రకుల్​.

    Rakul preeth

    Also Read: సమంత అందుకే అంత ప్రత్యేకం… సక్సెస్ సీక్రెట్ అదే!

    కాగా, తాజాగా ఓ మీడియాతో సరదాగా ముచ్చటించిన రకుల్​.. తన కెరీర్​కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలైనా చేస్తారా అని అడగ్గా.. సమాధానం చెప్తూ.. నాకు సినిమాలంటే ప్రాణం.. ఎప్పుడూ ఛాలెంజ్​ ఉండే పాత్రలే చేయాలని అనుకుంటుంటా.. వాటికోసం ఎంతగానైనా కష్టపడేందుకు సిద్ధం. కానీ, బరువు పెరగడం, తగ్గడం మాత్రం నా వల్లకాని పని.. అది సహజంగా జరగాల్సిన పని కావాలని బరువు పెరిగి, మళ్లీ తగ్గితే శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత నేనే అనారోగ్యం పాలవ్వాల్సి ఉంటుంది.  అందుకే ఒకవేళ అలాంటి పాత్రతో ఎవరైనా వచ్చినా.. నేను నిర్మొహమాటంగా కుదరదనే చెప్పేస్తా.. అంటూ చెప్పుకొచ్చింది రకుల్​.

    ఇటీవలే కొండపొలం సనిమాలో నటించిన రకుల్(Rakul preeth)​.. అందులో మంచి నటన కనబరిచి అందరి అభిమానాన్ని దక్కించుకుంది. క్రిష్​ తెరకెక్కించిన ఈ సినిమా ఓ నవల ఆధారంగా విభిన్న కథాంశంతో రూపొందించారు. ఇటీవలే ఏటీటీలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యింది.

    Also Read: త్రివిక్రమ్ కసరత్తులు.. అనన్య పాండేకి అవకాశం !