
TRS Vijaya Garjana: అధికార పార్టీ టీఆర్ఎస్ నవంబర్ 15న వరంగల్ లో విజయగర్జన సభ నిర్వహించాలని భావించింది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంది. కానీ దీన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. దీనిపై కేసీఆర్ దిశానిర్దేశం చేసి ఘనంగా నిర్వహించేందుకు నేతలకు బాధ్యతలు అప్పగించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఏర్పాట్లు పర్యవేక్షించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
వరంగల్ జిల్లా నేతలు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, నరేందర్, ఆలూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి వంటి నేతల అభ్యర్థన మేరకు విజయగర్జన సభ(TRS Vijaya Garjana) వాయిదా వేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. తెలంగాణ విజయ్ దివస్ అయిన నవంబర్ 29న విజయగర్జన సభ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
అందుకే నవంబర్ 29నే విజయగర్జన సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ నేతలు అందరు అంగీకరించినట్టు తెలుస్తోంది. వారందరి సమక్షంలోనే ఈమేరకు నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. దీక్షా దివస్ రోజే విజయగర్జనసభ నిర్వహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలకు తెలియజేయాలని సూచించారు. సభ నిర్వహణపై పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉండాలని తెలిపారు.
విజయగర్జన సభను వాయిదా వేయడంలో మరో ముఖ్యమైన అంశం ముడిపడి ఉందని చెబుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఫలితం ఎలా ఉంటుందోననే అనుమానం అందరిలో నెలకొంది. పార్టీ గెలుస్తుందని అందరిలో విశ్వాసం ఉన్నా పరిస్థితిలో మార్పు వచ్చి ప్రత్యర్థి గెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతోనే విజయగర్జన సభను వాయిదా వేసినట్లు సమాచారం. నేతలకు ఇబ్బందిగా ఉండకూడదనే ఉధ్దేశంతోనే సభను వాయిదా వేసినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా.
Also Read: ఈటల గెలిస్తే కేసీఆర్ ఇరుకునపడ్డట్టే.. ‘విజయగర్జన’ కంచికేనా?