YCP Win in Badvel :: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థులకు అందనంత స్పీడుగా దూసుకుపోయింది. పోటీచేసిన బీజేపీ, కాంగ్రెస్ లు అధికార వైసీపీకి ఏమాత్రం పోటీనివ్వలేకపోయాయి. ఈ క్రమంలోనే వైసీపీ భారీ ఆధిక్యంతో గెలిచింది.

తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన వైసీపీ అభ్యర్థి దాసరి సుధ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 8 రౌండ్లు ముగిసేసరికి ఆమె 68492 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
8వ రౌండ్లో వైసీపీకి 9691 ఓట్లు, బీజేపీకి 1964 ఓట్లు, కాంగ్రెస్ కు 774, నోటాకు 364 ఓట్లు వచ్చాయి. అన్ని రౌండ్లలో కలిపి వైసీపీకి 84682 ఓట్లు, బీజేపీకి 16190 ఓట్లు, కాంగ్రెస్ కు 5026, నోటాకు 2830 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ ఆధిక్యం ముందు ఇతర పార్టీలేవీ నిలబడలేకపోయాయి.
లెక్కించిన ఓట్లలో దాదాపు సగం కంటే ఎక్కువ ఓట్లు వైసీపీకి రావడంతో బద్వేలులో వైసీపీ సునాయాసంగా గెలిచేసింది. ఏకపక్ష విజయం సాధించింది. బీజేపీ, కాంగ్రెస్ లు ఏమాత్రం పోటీనివ్వలేకపోయాయి.